Advertisementt

‘సిరివెన్నెల’ సాంగ్‌‌పై లెజెండ్‌ల ప్రశంసలు

Sun 30th Jun 2019 05:26 PM
sirivennela,priyamani,ganesha song,sp balasubramanyam,shankar mahadevan  ‘సిరివెన్నెల’ సాంగ్‌‌పై లెజెండ్‌ల ప్రశంసలు
SP Balu and Shankar Mahadevan Praises Sirivennela Movie Song ‘సిరివెన్నెల’ సాంగ్‌‌పై లెజెండ్‌ల ప్రశంసలు
Advertisement
Ads by CJ

ఎస్‌.ఎస్ థ‌మ‌న్ విడుద‌ల చేసిన ‘సిరివెన్నెల’ సాంగ్‌కి ఎస్‌.పి.బాల‌సుబ్రమ‌ణ్యం, శంక‌ర్‌మ‌హ‌దేహన్ లు ప్ర‌శంసలు

పెళ్ళి త‌రువాత ప్ర‌ముఖ న‌టి ప్రియ‌మ‌ణి న‌టిస్తున్న చిత్రం సిరివెన్నెల‌. శాంతి టెలిఫిల్మ్స్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎ.ఎన్‌.బి కోఆర్డినేట‌ర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ మెత్తం పూర్తిచేసుకుని ప్ర‌స్తుతం పోస్ట్‌ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుంకుటుంది. ప్ర‌కాష్ పులిజాల ద‌ర్శ‌కుడు. కమల్ బోరా, ఏ.ఎన్. భాషా, ఏ.రామసీతా లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజ‌ర్ ని ఇటీవ‌లే బాలీవుడ్ స్టార్ డైర‌క్ట‌ర్ నీర‌జ్ పాండే చేతుల మీదుగా విడుద‌ల చేయ‌గా చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు క‌మ్రాన్ అందించిన సాంగ్ ని క్రేజి సంగీత ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్ త‌న సోష‌ల్‌మీడియా ద్వారా లాంచ్ చేశారు. ఆయ‌న విడుద‌ల చేసిన సాంగ్ కి లెజండ‌రీ సింగ‌ర్స్ ఎస్‌.పి.బాల‌సుబ్ర‌మ‌ణ్యం, శంక‌ర్ మ‌హ‌దేహన్ లు ప్ర‌శంసలు కురిపించారు. 

ఈ సంద‌ర్బంగా ఎస్‌.పి.బాల‌సుబ్ర‌మ‌ణ్యం మాట్లాడుతూ.. సంగీత ప్రియులంద‌రికి న‌మస్కారాలు.. ఇప్పుడే ఒక పాట వున్నాను. శాంతి టెలిఫిల్మ్స్ స‌మ‌ర్ప‌ణ లో ఎ.ఎన్.బి కోఆర్డినేట‌ర్స్ నిర్మిస్తున్న సినిమా సిరివెన్నెల సినిమాలోనిది. మా బాషా, క‌మ‌ల్ బోరా సంయుక్తంగా నిర్మించారు. జై జై గ‌ణేషా అనే పాట చాలా చ‌క్క‌గా వుంది. ముఖ్యంగా పాత సిరివెన్నెల నాకు చాలా ఇష్ట‌మైన సినిమా. అలాగే ఈ సినిమా కూడా అంతే విజ‌యాన్ని అందుకోవాల‌ని కోరుకుంటున్నాను. అలాగే ఈ సాంగ్ పాడిన ప్ర‌ణ‌తి రావు చాలా చాలా బాగా పాడింది. చివ‌ర‌లో వాయిస్ క‌లిపిన రాంసి, హ‌రిగుంట‌.. సాహిత్యాన్ని అందించిన శ్రీరామ్ త‌ప‌స్వి కి సంగీతం అందించిన క‌మ్రాన్ కి నా ప్ర‌త్యేక ధన్య‌వాదాలు. ఎందుకంటే చ‌క్క‌టి తెలుగు ప‌దాల‌తో తెలుగు పాట‌.. అందులోనూ గ‌ణేశ నామ‌స్మ‌ర‌ణ‌తో మొదలైన ఈ పాట సినిమా విజ‌యానికి నాంది కావాల‌ని కోరుకుంటున్నాను. అంద‌రూ బాగుండాలి స‌ర్వేజ‌నా సుఖినో భ‌వంతు’’ అని అన్నారు

శంక‌ర్ మ‌హ‌దేవ్ మాట్లాడుతూ.. ‘‘జై జై గ‌ణేశ అని మొద‌ల‌య్యే ఈ సాంగ్ చాలా బాగుంది. నిర్మాత బాషా గారు నిర్మించిన సిరివెన్నెల చిత్రం నుండి మొద‌టి సాంగ్ బ్యూటిఫుల్ సాంగ్ ఈసాంగ్ విజ‌యం సాధించాలి అలాగే సినిమా కూడా చాలా మంచి విజ‌యాన్ని అందుకోవాల‌నికి కోరుకుంటున్నాను’’ అన్నారు.

ఈ చిత్రంలో ప్రియమణితో పాటు... జూనియర్ మహానటిగా మంచిపేరు తెచ్చుకున్న సాయి తేజస్విని, బాహుబలి చిత్రంలో కిలి కిలి భాషతో భయంకరమైన విలన్ గా నటించిన కాలకేయ ప్రభాకర్, సీనియర్ నటుడు అజయ్ రత్నం, రాకెట్ రాఘవ తదితరులు నటించారు. 

సాంకేతిక వర్గం

నిర్మాతలు - కమల్ బోరా, ఏ.ఎన్. భాషా, ఏ.రామసీతా

రచన, దర్శకత్వం - ప్రకాష్ పులిజాల

మ్యూజిక్ - ఏఎన్ బి కోర్డినేటర్స్ మ్యూజిక్ ప్రొడక్షన్ కంపెనీ

సాంగ్స్ కంపోజింగ్ -  మంత్ర ఆనంద్, కమ్రాన్

డిఓపి - కళ్యాణ్ సమి

ఎడిటర్ - నాగేశ్వర్ రెడ్డి

లిరిక్స్ - శ్రీరామ్ తపశ్వీ

కొరియోగ్రాఫర్ - ఛార్లీ

ఫైట్స్ - రామకృష్ణ

ప్రొడక్షన్ కంట్రోలర్ - యోగానంద్

ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ - మోహన్ పరుచూరి, 

పీఆర్వో - ఏలూరు శ్రీను

SP Balu and Shankar Mahadevan Praises Sirivennela Movie Song:

Sirivennela Movie Song Released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ