సినీ నటీనటులకు రాజకీయాలేం కొత్త కాదు.. ఎందరో వెండి తెరను ఏలిన మహానుభావులు రాజకీయాల్లో రాణించి సత్తా చాటి గెలిచి నిలిచారు. అయితే అదే నటుల బాటలో నడిచొచ్చిన మరికొందరు నటులు మాత్రం అట్టర్ ప్లాప్ ఫామ్ హౌస్‌లకే పరిమితం అయిన వాళ్లు కూడా ఉన్నారు. అంతేకాదు.. మరికొందరు నేతలు ఒకట్రెండు సార్లు తగిలిన రాజకీయ ఎదురుదెబ్బలతో కోలుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
నటీనటులు రాజకీయాల్లోకి అదృష్టం పరిశీలించుకునే ఇండస్ట్రీల్లో కోలీవుడ్, టాలీవుడ్ ఎక్కువగానే ఉంటుంది. తాజాగా.. తమిళ్ స్టార్ హీరో సూర్య సతీమణి జ్యోతిక రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని పెద్ద ఎత్తున వార్తలు వినవస్తున్నాయి. ఈ ఎంట్రీ విషయం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే ఈ వార్తలో నిజానిజాలెంతో తెలియదు కానీ.. సోషల్ మీడియా, టీవీ చానెళ్లు, పేపర్లలో గట్టిగానే వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే నిజంగానే జ్యోతిక రాజకీయాల్లోకి వస్తుందా..? రాదా.. ? అనే విషయంపై మాత్రం ఇంత వరకూ క్లారిటీ రాలేదు.. ఆమె గానీ.. ఆమె కుటుంబ సభ్యులుగానీ ఇంతవరకూ ఈ వ్యవహారంపై రియాక్ట్ అవ్వలేదు. అయితే సూర్య సతీమణి రాజకీయాల్లోకి వస్తే మాత్రం ఎలాంటి ఢోకా లేదని.. ఆయన చేసిన మంచిపనులే గెలుపు బాటలో నడిపిస్తాయని.. ఆలస్యం చేయకుండా ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు, నెటిజన్లు సలహాలు ఇస్తున్నారు. అయితే జ్యోతిక నిజంగానే పాలిటిక్స్ ఎంట్రీ ఇస్తారా..? లేకుంటే మళ్లీ సినిమాలపైనే దృష్టిసారిస్తారా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.