మిల్క్ బ్యూటీ తమన్నా గురించి కొత్తగా చెప్పుకోనక్కర్లేదు. టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి ఇంత వరకూ ఆమెకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి మాత్రం రాలేదు. వరుస సినిమాలతో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించి కోట్లాది మంది మనసులను దోచుకుంది. ఒకానొక సందర్భంలో ఈమెకోసం డైరెక్టర్లు క్యూ కట్టేవారంటే ఆమె రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
ఒకప్పుడు టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపిన మిల్క్ బ్యూటీ ఇప్పుడు తిన్నగా రూట్ మార్చి బాలీవుడ్ బాట పట్టింది. అయితే ఇక్కడ కూడా ఓ ఊపు ఊపి మళ్లీ టాలీవుడ్‌కే రావాలని డిసైడ్ అయ్యిందట. ఇప్పటికే హిందీలో ‘హిమ్మత్ వాలా, తుటాక్ తుటాక్ తూటియా, ఖామోషి’ సినిమాలతో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ తాజాగా.. మరో ‘బోలె చుడియన్’ అనే కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా.. ఈ చిత్రంలో స్టార్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ సరసన మిల్క్ బ్యూటీ అందాల ఆరబోయనుంది.
మొత్తానికి చూస్తే మిల్క్ బ్యూటీ ఇప్పట్లో బాలీవుడ్‌ను వదిలి టాలీవుడ్‌కు వచ్చే పరిస్థితులు మాత్రం కనిపించట్లేదు. మరోవైపు ఆమె కోసం పలువురు దర్శకులు కథ రెడీ చేసుకుని తమన్నా డేట్స్ కోసం వేయి కళ్లతో వేచి చూస్తున్నారట. ఒక వేళ ఇప్పట్లో బ్యూటీ ఉండే బిజిబిజీకి టాలీవుడ్‌ను రాలేను పొండి అని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో. అయితే ఆ ముద్దుగుమ్మ బాలీవుడ్‌ను ఎప్పుడు ఓ ఊపు ఊపుతుందో.. టాలీవుడ్ వైపు ఎప్పుడు చూస్తుందో వేచి చూడాల్సిందే మరి.