అవును మీరు వింటున్నది నిజమే.. హాట్ బ్యూటీ రాధికా ఆప్టే గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. రీల్ అయినా.. రియల్ అయినా ఈమె క్రేజే వేరని చెప్పుకోవాలి. అయితే ఇటీవల ‘బీఎఫ్ఎఫ్’ షోలో పాల్గొన్న ఆమె ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ హాట్ బ్యూటీ తాగి తాగి.. ఫుల్‌గా తిని తెగ లావెక్కిపోయిందట. దీంతో సినిమా చాన్స్ మిస్సయ్యిందట ఈ విషయాన్ని స్వయంగా ఆమె చెప్పుకొచ్చింది.
ఇక అసలు విషయానికొస్తే.. గతంలో నేను బాగా మద్యం సేవించడంతో లావెక్కిపోయాను. దీంతో ‘విక్కీ డోనర్’ చిత్రంలో కథానాయికగా వచ్చిన అవకాశాన్ని కోల్పోయాను. ఈ చిత్రంలో కథానాయికగా ఎంపికైన అనంతరం చిత్రీకరణకు కాస్త సమయం ఉండటంతో రాధిక కొన్ని రోజుల పాటు విహార యాత్రకు వెళ్లాను. అయితే అక్కడ బీరు తాగి, బాగా తిని లావైపోయాను. దీంతో నన్ను సినిమా నుంచి తప్పించారు" అని చెబుతూ రాధికా ఒకింత ఆవేదనకు లోనైంది.
అయితే తనకు కొంత సమయం ఇస్తే సన్నబడతానని వేడుకున్నానని కూడా ఈ బ్యూటీ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తన స్థానంలో యామీ గౌతమ్‌ను తీసుకున్నారు. అందుకే అప్పట్నుంచి తాను తిండి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నానని స్పష్టం చేసింది.