Advertisementt

రెజీనాతో రిలేషన్‌షిప్‌పై పెదవి విప్పిన హీరో!

Sat 29th Jun 2019 02:51 PM
sundeep kishan,rejina,relationship,tollywood   రెజీనాతో రిలేషన్‌షిప్‌పై పెదవి విప్పిన హీరో!
sundeep kishan gives clarity on relationship with rejina రెజీనాతో రిలేషన్‌షిప్‌పై పెదవి విప్పిన హీరో!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ లవ్ గురించి ఇప్పటికే పలుమార్లు పెద్ద ఎత్తున పుకార్లు వినిపించిన సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా రెజీనాతో ఈ కుర్ర హీరో రిలేషన్‌షిప్‌లో ఉన్నాడన్న వార్తలు నాటి నుంచి ఇప్పటి వరకూ ఆగట్లేదు. అయితే తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన లవ్ ట్రాక్.. రెజీనాతో రిలేషన్‌షిప్‌పై ఆయన పెదవి విప్పారు.

తనకు రెజీనాతో ఏదో ఉన్నట్టు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని అవన్నీ ఒట్టి పుకార్లేనని.. అందులో ఎలాంటి వాస్తవం లేదని కొట్టిపారేశారు. మా ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషిన్‌లేదని.. ఓన్లీ ఫ్రెండ్‌షిప్ మాత్రమేనని పుకార్లకు కుర్ర హీరో ఫుల్‌స్టాప్ పెట్టేశాడు. తామిద్దరం డైలీ ఫోన్‌లో టచ్‌లో ఉంటామని కూడా చెప్పుుకొచ్చారు.

అంతటితో ఆగని సందీప్.. ప్రస్తుతానికి తాను లవ్‌లో లేనని.. సింగిల్‌గానే ఉన్నానని రెండేళ్ల క్రితం వరకు ఒక అమ్మాయితో రిలేషన్ షిప్‌లో ఉన్నానని చెప్పుకొచ్చాడు. ఆ రిలేషన్ షిప్ కొన్ని అనివార్య కారణాల వల్ల కట్ అయ్యిందని.. ఆ అమ్మాయి పేరు చెప్పడం తప్పని అందుకే తానేమీ చెప్పలేకపోతున్నానని సందీప్ కిషన్ తెలిపారు. సో.. ఇకనైనా ఇలాంటి పుకార్లకు సంబంధించిన వార్తలు ఆగుతాయో లేదో వేచి చూడాల్సిందే మరి.

sundeep kishan gives clarity on relationship with rejina :

Tollywood Young Hero sundeep kishan gives clarity on relationship with Actress rejina 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ