Advertisementt

బిగ్‌బాస్ హోస్ట్‌గా నాగ్.. ‘మా’ అధికారిక ప్రకటన

Sat 29th Jun 2019 02:45 PM
star maa,bigg boss telugu season 3,host,akkineni nagarjuna  బిగ్‌బాస్ హోస్ట్‌గా నాగ్.. ‘మా’ అధికారిక ప్రకటన
Star Maa declares bigg boss telugu season 3 host బిగ్‌బాస్ హోస్ట్‌గా నాగ్.. ‘మా’ అధికారిక ప్రకటన
Advertisement
Ads by CJ

బిగ్‌బాస్‌-3కి హోస్ట్‌గా టాలీవుడ్‌ మన్మథుడు అక్కినేని నాగార్జున అని ‘స్టార్ మా’ ఓ ప్రకటనలో అధికారికంగా ప్రకటన చేసింది. అంతకుముందు ఓ ప్రోమోలోనే నాగార్జున హోస్ట్ అని నిర్వాహకులు రివీల్ చేసేశారు. ఈ సందర్భంగా నాగ్ గురించి.. షో గురించి పలు ఆసక్తికర విషయాలను మా ఓ ప్రకటనలో చెప్పుకొచ్చింది. 

తరాలతో సంబంధం లేకుండా సంపాదించుకున్న అభిమానం, సామాజికంగా సాధించుకున్న పేరు ప్రఖ్యాతులతో ఆయన ప్రత్యేక వ్యక్తిత్వం ప్రేక్షకుల్లో విభిన్న వర్గాలకు ఈ షోను చేరవేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవల విడుదలైన లోగో లాంచ్ టీజర్, హోస్ట్ టీజర్‌ ఫిల్మ్‌తో మార్కెట్లో ఇప్పటికే విపరీతంగా ఊహాగానాలు, భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 

ఈ సందర్భంగా నాగ్ గురించి చెబుతూ.. విలక్షణమైన స్టైల్‌కు పర్యాయపదం, మంచితనానికి నిర్వచనం, విజ్ఞానానికి నిదర్శనంగా చెప్పదగ్గ నాగార్జున ఈ షోకి కొత్త ఎనర్జీ ఇవ్వబోతున్నారు. ప్రేక్షకులకు వినూత్నమైన అనుభూతిని కలిగించబోతున్నారు. మరోవైపు కింగ్ మాట్లాడుతూ.. తాను ఎన్నో విషయాల్లో ప్రయోగాలు చేశానని.. అవన్నీ తనకు ఎక్స్‌పీరియన్స్‌గా ఉన్నాయని చెప్పుకొచ్చారు. మరీ ముఖ్యంగా బిగ్‌బాస్ షో చేయడం కొత్త అనుభూతి అని ఇందులో భాగమైనందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ కొత్త ప్రయాణం కోసం ఎంతగానే ఎదురుచూస్తున్నానని కింగ్ చెప్పుకొచ్చారు. కాగా ఈ షో అతి త్వరలోనే ప్రారంభం కానుంది. 

Star Maa declares bigg boss telugu season 3 host:

Star Maa declares tollywood hero Akkineni Nagarjuna as  bigg boss telugu season 3 host

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ