Advertisementt

‘సాహో’ అప్డేట్: 1368 అడుగుల ఎత్తులో..!

Sat 29th Jun 2019 07:31 AM
saaho,second song,vaibhavi merchant,saaho,uv creations,saaho update  ‘సాహో’ అప్డేట్: 1368 అడుగుల ఎత్తులో..!
Saaho completes another Song shoot ‘సాహో’ అప్డేట్: 1368 అడుగుల ఎత్తులో..!
Advertisement
Ads by CJ

బాలీవుడ్  కొరియోగ్రాఫ‌ర్ వైభ‌వి మ‌ర్చంట్ ఆధ్వర్యంలో ఆస్ట్రియాలో 1368 అడుగుల ఎత్తులో  ‘సాహో’ సాంగ్ పూర్తి

‘బాహుబలి’ 1, 2 తరువాత  ప్ర‌పంచంలో వున్న ప్ర‌తి సినిమా ల‌వ‌ర్ చూపు యంగ్ రెబల్‌స్టార్ ప్ర‌భాస్ వైపు తిరిగింది. ఈ త‌రుణంలో సాహో మేకింగ్ మెద‌ల‌య్యే స‌రికి వారి ఆనందానికి అవ‌ధులు లేవు. సోష‌ల్ మీడియాలో అయితే వ‌ర‌ల్డ్ వైడ్ గా ప్ర‌భాస్ న‌టిస్తున్న సాహో సినిమా నెక్ట్స్ అప్‌డేట్ ఏమటి అనే సెర్చ్ విప‌రీతంగా జ‌రుగుతుంది. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానుల ఉత్కంఠని మరింత పెంచుతూ మూడు భాషల్లో భారీ బడ్జెట్ తో టాలీవుడ్ ప్రేస్టేజియ‌స్ ప్రోడ‌క్ష‌న్ హౌస్ యువి క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లో వంశీ, ప్ర‌మోద్, విక్ర‌మ్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇదిలావుంటే ఈ చిత్రానికి సంబంధించిన ఆస్ట్రియాలోని అత్య‌ద్భుత‌మైన లోకేష‌న్స్ లో బాలీవుడ్ ఫేమ‌స్ కొరియోగ్రాఫ‌ర్ వైభ‌వి మ‌ర్చంట్ కొరియోగ్ర‌ఫిలో సాంగ్ చిత్రీక‌ర‌ణ చేశారు. ఈ సాంగ్ కోసం చాలా అంద‌మైన లొకేష‌న్స్ చూడ‌టం జ‌రిగింది. ఈ సాంగ్ చిత్రీక‌ర‌ణ 1368 అడుగుల ఎత్తులో కేబుల్ కార్స్ తీసుకుని చేయ‌టం జ‌రిగింది. అయితే అంత ఎత్తులో షూట్ జ‌రుగుతున్న‌ప్పుడు యూనిట్ అంతా కంగారుప‌డ‌కుండా హీరో ప్ర‌భాస్ అంద‌ర్ని స‌పోర్ట్ చేస్తూ ఎంక‌రేజ్ చేశారు. చిత్ర యూనిట్ అంతా ఇంత‌లా స‌పోర్ట్ చేసినందుకు  సోష‌ల్ మీడియా ద్వారా నిర్మాత‌లు ధన్య‌వాదాలు తెలిపారు. ఈ చిత్రానికి జిబ్రాన్ అందించిన‌ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రత్యేకంగా నిలవనుంది. ప్రతీ సీన్ ని ఎలివేట్ చేసే విధంగా వరల్డ్ క్లాస్ క్వాలిటీ రీ రికార్డింగ్ అందించనున్నారు జిబ్రాన్. ఇక ఈ సాహో చిత్రం ఇండిపెండెన్స్ డే కానుకగా అగ‌స్ట్ 15 న ప్ర‌పంచ‌వ్యాప్తంగా బిగ్గెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ద ఇయ‌ర్ గా విడుద‌లకి సిద్ధ‌మౌతోంది. 

యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

బ్యానర్  - యువి క్రియేషన్స్

దర్శకుడు - సుజీత్

నిర్మాతలు - వంశీ-ప్రమోద్-విక్కీ

సినిమాటోగ్రాఫర్ - మధి

ఆర్ట్ డైరెక్టర్ - సాబు సిరీల్

ఎడిటర్ - శ్రీకర్ ప్రసాద్

పిఆర్వో - ఏలూరు శ్రీను

Saaho completes another Song shoot:

Saaho Movie Latest Update 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ