Advertisementt

‘నేను లేను’ విడుదల తేదీ ఫిక్సయింది!

Sat 29th Jun 2019 07:28 AM
nenu lenu,release date,july 12th,harshith,vamsi krishna pandya,ram kumar  ‘నేను లేను’ విడుదల తేదీ ఫిక్సయింది!
Nenu Lenu Release Date Fixed ‘నేను లేను’ విడుదల తేదీ ఫిక్సయింది!
Advertisement
Ads by CJ

హ‌ర్షిత్‌, వంశీకృష్ణ‌ పాండ్య‌, శ్రీ‌ప‌ద్మ‌, మాధ‌వి, బిశ్వ‌జిత్‌నాధ్‌ ప్రధాన పాత్రలుగా ఓ.య‌స్‌.యం విజన్ - దివ్యాషిక క్రియేష‌న్స్ పతాకాలపై సుక్రి  నిర్మిస్తున్న చిత్రం ‘నేను లేను’. ‘లాస్ట్ ఇన్ లవ్’ అనేది ఉప‌శీర్షిక‌. సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి రామ్ కుమార్ దర్శకత్వం వహించగా ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్రం ట్రైలర్ 10 మిలియన్ వ్యూస్‌ను అందుకుని ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ అందుకుంది. సెన్సార్  కార్యక్రమాలు పూర్తయ్యి యు బై ఏ సర్టిఫికేట్ పొందగా జూలై 12న ఈ సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా ద‌ర్శ‌కుడు రామ్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రం అన్ని పనులు పూర్తిచేసుకుని జూలై 12 న రిలీజ్ కాబోతుంది. ఒక అందమైన ప్రేమకథతో తెర‌కెక్కిన‌ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రమిది. ఆద్యంతం ప్రేక్షకులను ఉత్కంఠపరుస్తుంది. ఈ సినిమా ట్రైలర్‌ని కోటి మంది చూశారు.. ట్రైలర్ లాగే సినిమా కూడా అందరిని ఆకట్టుకుంటుంది. ప్రేక్షకులు తప్పకుండా చూడండి’’ అన్నారు.

నిర్మాత  సుక్రి మాట్లాడుతూ... ఈ సినిమా సెన్సార్  కార్యక్రమాలు పూర్తయ్యాయి. యు బై ఏ సర్టిఫికేట్ లభించింది. ‌కోటి మంది ఈ ట్రైలర్ ని చూశారంటే మా సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందనే నమ్మకం తప్పక ఉంది. జూలై 12న ఈ సినిమాని విడుదల చేస్తున్నాం. ఇండియన్ సినిమా స్క్రీన్ పై ఇప్పటివరకు రానీ చూడని సరికొత్త కాన్సెప్ట్ తో  వస్తున్న సినిమా ఇది. అందరిని తప్పకుండా అలరిస్తుంది’’ అన్నారు. 

హ‌ర్షిత్‌, వంశీకృష్ణ‌ పాండ్య‌, శ్రీ‌ప‌ద్మ‌, మాధ‌వి, బిశ్వ‌జిత్‌నాధ్‌, రుద్ర‌ప్ర‌కాశ్‌, వేల్పుల‌ సూరి, యుగంధ‌ర్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి  సంగీతం: ఆశ్రిత్‌, ఛాయాగ్ర‌హ‌ణం:ఎ. శ్రీ‌కాంత్ (బి.ఎఫ్‌.ఎ), నృత్యాలు: జోజో, నిర్వాహ‌ణ: సురేష్‌కూర‌పాటి, పి.ఆర్‌.ఓ‌: సాయి స‌తీష్ పాల‌కుర్తి, విఎఫ్ఎక్స్: ప్రభురాజ్‌, ఎస్.ఎఫ్.ఎక్స్: పురుషోత్తం రాజు, ఆడియోగ్ర‌ఫీ: రంగ‌రాజ్‌, క‌ల‌రిస్ట్ః క‌ళ్యాణ్ ఉప్పాల‌పాటి, ప్ర‌చార చిత్రాలు: శ్రీ‌క‌, స‌హాయ‌ద‌ర్శ‌కులు: జె.మోహ‌న్‌కాంత్‌, ద‌ర్మేంద్ర‌, సురేశ్‌, స‌హ‌నిర్మాత: య‌షిక,  నిర్మాత : సుక్రి , రచన- దర్శకత్వం: రామ్ కుమార్ ఎమ్.ఎస్.కె.

Nenu Lenu Release Date Fixed:

10 Million views to Nenu Lenu Movie Trailer

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ