మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ చిత్రం సైరా నరసింహారెడ్డి రీసెంట్ గా షూటింగ్ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ కు సిద్ధం అయింది. సురేంద్ర రెడ్డి దర్శకత్వం చేస్తున్న ఈ సినిమాకి బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈసినిమాకి అమిత్ మ్యూజిక్ చిరుకి బాగా నచ్చిందట.
హిస్టారికల్ మూవీకి ఇటువంటి మంచి సంగీతం అందించడంతో కమర్షియల్ సినిమాకు కూడా న్యాయం చేయగలడని భావిస్తూ తన 152వ చిత్రానికి కూడా అతనినే తీసుకోవాలని అనుకుంటున్నారట చిరు. అందుకే తను నెక్స్ట్ చేయబోయే కొరటాల సినిమాకి కోసం ఈయనను తీసుకోవాలని చిరు ప్రతిపాదించాడట.
మరి చిరు మాట మేరకు త్రివేదికి కొరటాల ఓకే చెప్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. ఎందుకంటే కొరటాల మొదటి సినిమా నుండి దేవిశ్రీతోనే చేసాడు. కొరటాల - దేవికి మధ్య బాండింగ్ కూడా చాలా బాగుంటుంది. అలానే చిరుకి దేవి అయినా పర్లేదు. కానీ ఈసారి కొత్తగా ట్రై చేయాలనుకుంటున్నారు. అందుకే త్రివేదిని తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం వెలువడుతుందని తెలుస్తోంది.