అన్నపూర్ణ స్టూడియోస్ లో వరసగా రెండు సినిమాలు తీసి హిట్ అందుకున్నాడు దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ. ఆ రెండు హిట్స్ తరువాత ఆ సంస్థ నుండి బయటికి వెళ్లి రవితేజతో ‘నేల టిక్కెట్టు’ అనే సినిమా తీసి అంతకుముందు తీసిన రెండు సినిమాలతో వచ్చిన పేరు చెడగొట్టుకున్నాడు. దాంతో మనోడికి ఛాన్సులు రావడంలేదు. చేసేది ఏమి లేక మళ్లీ తన సొంత గూటికి అంటే అన్నపూర్ణ స్టూడియోస్ కాంపౌండ్‌లో అడుగుపెట్టాడు.
‘సోగ్గాడే చిన్నినాయనా’ సీక్వెల్ ‘బంగార్రాజు’ ను లైన్ లోకి తీసుకువచ్చాడు. ఈమూవీలో నాగార్జున, నాగచైతన్య ఇద్దరూ కలిసి నటిస్తున్నారు. ఇందులో చైతు బంగార్రాజుకి మనవుడిగా కనిపించనున్నాడు. ఆల్మోస్ట్ స్టోరీ మొత్తం ఓకే అయిపోయింది. త్వరలోనే ఈమూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే కళ్యాణ్ కృష్ణ ఆ రెండు హిట్స్ వచ్చిన తరువాత కూడా అక్కడే ఉండి ఉంటే అన్నపూర్ణ కాంపౌండ్‌లో బాగా వెయిట్ వుండేది. రెమ్యూనరేషన్ బాగా పెరిగేది.
కానీ బయటకు వెళ్లి నేల టిక్కెట్టుతో నేల మీదకి వచ్చేసిన ఆ దర్శకుడికి ఇప్పుడు ఫిక్స్‌డ్ రెమ్యూనరేషన్ లేదట. ఓన్లీ ఎక్స్‌పెన్సస్ మాత్రమే ఇస్తున్నారట. ఒకవేళ సినిమా హిట్ అయితే అందులో షేర్ ఇస్తానని నాగ్ ముందుగానే చెప్పాడట. దానికి కృష్ణ ఒప్పుకునే ఈమూవీ చేస్తున్నాడు అని టాక్ నడుస్తుంది.