Advertisementt

ప్రమోషన్స్ కి సపోర్ట్ ఇవ్వడంలో ఈ హీరోయిన్ టాప్!

Fri 28th Jun 2019 06:03 PM
samantha,attends,oh baby,promotions  ప్రమోషన్స్ కి సపోర్ట్ ఇవ్వడంలో ఈ హీరోయిన్ టాప్!
This Heroine Gives Full Support to Promotions ప్రమోషన్స్ కి సపోర్ట్ ఇవ్వడంలో ఈ హీరోయిన్ టాప్!
Advertisement
Ads by CJ

సాధారణంగా హీరోయిన్స్ తమ సినిమా షూటింగ్ అయ్యిపోయాక ఆ సినిమా గురించి అసలు పట్టించుకోరు. పైగా ప్రమోషన్స్ కి రమ్మన్న తెగ ఇబ్బంది పెడుతుంటారు. కానీ సమంత అందుకు వ్యతిరేకం. తను నటించిన సినిమాలో తన పాత్ర నచ్చితే చాలు ఎంతవరకు అయినా వెళ్తుంది సామ్. సినిమా పూర్త‌య్యాక ప్ర‌మోషన్ ఘ‌ట్టాన్నీ త‌న నెత్తిమీద వేసుకుంటుంది.

‘యూ ట‌ర్న్‌’, ‘మ‌జిలీ’ సినిమాల‌కు ఇదే జ‌రిగింది. ఇప్పుడు లేటెస్ట్ మూవీ ‘ఓ బేబీ’ విష‌యంలోనూ అదే జ‌రుగుతోంది. సామ్ ఈమూవీ యొక్క ప్రమోషన్స్ విషయంలో చాలా శ్ర‌ద్ధ తీసుకుంటోంది. ప్రమోషన్ ఎలా చేయాలి? ఏం చేస్తే ప్రేక్షకులు సినిమాకి కనెక్ట్ అవ్వుతారు? అటువంటి ఇంపుట్స్ అన్ని సామ్ చిత్ర‌బృందం సలహాలు ఇస్తుందట.

ప్రమోషన్ ఘట్టాన్ని ద‌గ్గ‌రుండి చూసుకుంటోంది. ఈసినిమాకి సంబంధించి ప్రమోషన్స్ అన్ని కంప్లీట్ అయిన తరువాతే తన నెక్స్ట్ సినిమా గురించి ఆలోచిస్తా అంటుంది సామ్. తిరుప‌తి, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం లాంటి ప‌లు న‌గ‌రాల్లో ఓబేబీ ప్ర‌మోష‌న్ ఈవెంట్స్ జ‌ర‌గ‌బోతున్నాయి. ఈ ఈవెంట్స్ లో సామ్ పాలు పంచుకోనుంది. యూట్యూబ్, టీవీ, ఎఫ్ ఎమ్‌, ప్రింట్ మీడియా ఇంటర్వ్యూలు కూడా డైలీ జరుగుతూనే ఉన్నాయి. అలా ఈసినిమా ప్రమోషన్స్ విషయం మొత్తం తానై చూసుకుంటుంది సామ్.

This Heroine Gives Full Support to Promotions:

Samantha Attends Oh Baby Promotions

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ