Advertisementt

చిరు చిన్నల్లుడు ట్వీట్.. ఫొటో వైరల్

Thu 27th Jun 2019 04:09 PM
chiranjeevi,son in law,kalyan dhev,photo,social media  చిరు చిన్నల్లుడు ట్వీట్.. ఫొటో వైరల్
Chiranjeevi Son in Law Post Viral in Social Media చిరు చిన్నల్లుడు ట్వీట్.. ఫొటో వైరల్
Advertisement
Ads by CJ

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కుమార్తె శ్రీజ ఆరు నెలల క్రితం పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ పాపకు నవిష్క పేరు కూడా పెట్టడం జరిగింది. పాపకు అయితే ఆర్నెళ్లు పూర్తయిన సందర్భంగా మెగా అల్లుడు కల్యాణ్ దేవ్ తన ట్విట్టర్ వేదికగా.. పాపతో కలిసున్న ఫొటోను పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కళ్యాణ్ కూతురు క్యూట్ నెస్‌కు మెగాభిమానులు, నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తూ మరికొందరు చిన్నారికి శుభాకాంక్షలు ఆశీర్వాదాలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఆడపిల్లలున్న తల్లిదండ్రులకు కల్యాణ్ ఒకింత సలహా ఇచ్చే ప్రయత్నం చేశారు. 

మీ కూతుర్ల పెళ్లి విషయంలో మీకు టెన్షన్ లేకుండా ఉండాలంటే సామర్థ్యం కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దాలన్నారు. అమ్మాయిల పెళ్లి కోసం డబ్బు కూడబెట్టే బదులుగా వారికి మొదటి నుండి మంచి ఎడ్యుకేషన్ ఇప్పించండి. స్వశక్తితో నిలిచేలా ఆమెను తీర్చి దిద్దండని కల్యాణ్ దేవ్ చెప్పుకొచ్చారు. ఫొటోతో పాటు చిరు అల్లుడు చేసిన ఈ ట్వీట్‌కు మెగా ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీలవుతూ.. సూపర్బ్ సార్.. మీరు కేక అంటూ రిప్లై ఇస్తున్నారు. 

Chiranjeevi Son in Law Post Viral in Social Media:

Mega Fans Happy With Kalyan Dhev Tweet

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ