Advertisementt

బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వక ముందే నాగ్‌పై ట్రోలింగ్!

Wed 26th Jun 2019 09:42 PM
nagarjuna,bigg boss 3,entry,trolling,social media  బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వక ముందే నాగ్‌పై ట్రోలింగ్!
Before Bigg Boss Entry.. Trolling on Nagarjuna బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వక ముందే నాగ్‌పై ట్రోలింగ్!
Advertisement
Ads by CJ

తెలుగు బిగ్‌బాస్-3కి హోస్ట్‌గా టాలీవుడ్ మన్మథుడు, అక్కినేని నాగార్జున దాదాపు ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. అధికారికంగా ప్రకటన ఒక్కటే మిగిలుంది. అయితే బిగ్‌బాస్ సీజన్-03 అన్నప్పట్నుంచి నాగ్ దానికి హోస్ట్ అని వార్తలు వచ్చేశాయి. అయితే ఆయన పేరు ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. ఇంకా హౌస్‌లోకి కూడా ఎంట్రీ ఇవ్వలేదు. అప్పుడే నెట్టింట్లో నాగ్‌పై నెటిజన్లు సెటైర్ల వర్షం కురిపిస్తూ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.

ఈ ట్రోలింగ్‌కు కారణం.. నాగ్-నాని కలిసి నటించిన ‘దేవదాస్’ మూవీ ప్రమోషన్‌లో బిగ్‌బాస్ ప్రస్తావన రాగా.. ఆ షో గురించి తన దగ్గర మాట్లాడొద్దు బాబాయ్.. ఆ కాన్సెప్ట్, ఆ దాగుడు మూతలు ఇవన్నీ తనకు నచ్చవని తెగేసి చెప్పేశారు. అంటే అప్పట్లో తనకు హోస్ట్‌గా వెళ్లడం ఇష్టం లేదనే పరోక్షంగా హింటిచ్చారన్న మాట.

అయితే ఇప్పుడు మాత్రం ఆ మాటలన్నీ మరిచిపోయిన నాగ్.. ‘మా’ యాజమాన్యానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. ఇదెలా..? ఓహ్.. అంతా డబ్బు మాయ.. డబ్బు ఏ పనైనా చేస్తుంది లెండి.. అంటూ నెటిజన్లు సెటైర్లేస్తున్నారు. మరికొందరు అప్పుడు ఏం నచ్చలేదు.. ఇప్పుడేం తమరికి నచ్చిందో ఓసారి చెప్పుకోండి సార్.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ట్రోలింగ్‌పై నాగ్ ఎలా రియాక్ట్ అవుతారో మరి. మొన్న కాళేశ్వరం ప్రారంభం రోజున మాజీ మంత్రి హరీష్ పేరు మరవడంతో.. నేడు బిగ్‌బాగ్ హోస్ట్ వ్యవహారంలో ఇలా ఈ మధ్య రెండు సార్లు నాగ్ ట్రోలింగ్‌‌కు గురయ్యారు!

Before Bigg Boss Entry.. Trolling on Nagarjuna:

Nagarjuna Trolled by his Speaks at Devadas Time

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ