మలయాళంలో తెరకెక్కిన ఒరు ఆధార్ లవ్ సినిమాలో కన్ను గీటి గన్ను పేల్చిన హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్... ఆ ఒక్క సీన్ తోనే సోషల్ మీడియాలోనే కాదు.... వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయ్యింది. కానీ సినిమా విడుదలయ్యాక గాని ప్రియా ప్రకాష్ అసలు బయటికి రాలేదు. ఆ సినిమాలో ప్రియా చేసిన రోల్ గెస్ట్ రోల్ లాంటిది. అలాగే నటనలోనూ ప్రియా ప్రకాష్ చాలా వీక్. అయితే ఒరు ఆధార్ లవ్ సినిమా విడుదల కాక మునుపు ప్రియా ప్రకాష్ కి బోల్డన్ని ఆఫర్స్ క్యూ కట్టాయి. కానీ సినిమా విడుదలయ్యాక ప్రియా మొహం కూడా దర్శకనిర్మాతలు చూడలేదు. ఎట్టకేలకి టాలీవుడ్ హీరో నితిన్ ప్రియాప్రకాష్ కి, చంద్రశేఖర్ యేలేటి సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. రకుల్ ప్రీత్ మెయిన్ హీరోయిన్ కాగా.. ప్రియా ప్రకాష్ సెకండ్ హీరోయిన్.
అయితే ఈ సినిమాతో ప్రియా ప్రకాష్ క్రేజ్ పెరుగుతుంది అనుకుంటే పొరబాటే ఎందుకంటే.. చంద్రశేఖర్ యేలేటి - నితిన్ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్ కి ఎక్కువ స్క్రీన్ స్పేస్ లేదట. దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి... ప్రియా ప్రకాష్ స్క్రీన్ టైంని కేవలం 20 నిమిషాల సేపే రాసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రియా ప్రకాష్ సినిమాలో కనిపించిన ఆ కాసేపూ.. ప్రియ అల్లరి ఆకట్టుకుంటుందట. దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి ఆ పాత్రని అలా డిజైన్ చేసి పెట్టుకున్నాడట.
అయితే ఎలాగూ రకుల్ ప్రీత్ మెయిన్ హీరోయిన్ కాబట్టి.. ప్రియా ప్రకాష్ ని సెకండ్ హీరోయిన్ కింద తీసుకున్నప్పటికీ.... ఎక్కువ సీన్ లేకుండా ప్రియా వారియర్ పాత్ర సెకండ్ హీరోయిన్ కంటే చిన్నదే అన్నట్టుగా ఉంటుందట. మరి హీరోతో సమానంగా, రకుల్ తో సమానంగా తనకి క్యారెక్టర్ పడకపోయినా.. ఉన్నకాసేపు ప్రియా ప్రకాష్ మార్క్ మాత్రం కనబడుతుంది అని అంటున్నారు. ఏదైనా ప్రియా ప్రకాష్ కెరీర్ ముందు అనుకున్నట్టుగా అయితే లేదు.