Advertisementt

మీకో దండం.. నేను బిగ్‌బాస్‌-3కు వెళ్లట్లేదు!

Wed 26th Jun 2019 04:06 PM
sobhita dhulipala,react,bigg boss 3,social media  మీకో దండం.. నేను బిగ్‌బాస్‌-3కు వెళ్లట్లేదు!
Heroine Reaction on Bigg Boss Consistent Rumours మీకో దండం.. నేను బిగ్‌బాస్‌-3కు వెళ్లట్లేదు!
Advertisement
Ads by CJ

తెలుగులో బిగ్‌బాస్-3 సీజన్ త్వరలో ప్రారంభం కానున్న సందర్భంలో.. ఫలానా వాళ్లు కంటెస్టెంట్‌లుగా వెళ్తున్నారు..? ఫలానా హీరోయిన్ నో చెప్పిందట..? ఇలాంటి వార్తలు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. ఇలాంటి వార్తలే.. ‘గుఢాచారి’లో మెరిసిన టాలీవుడ్ బ్యూటీ శోభిత ధూళిపాళ్లపై కూడా వచ్చాయి. తాజాగా ఈ పుకార్లపై ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అవుతూ క్లారిటీ ఇచ్చింది.

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌గా తాను సెలెక్ట్ అయ్యానని వస్తున్న వార్తలన్నీ అబద్ధాలే. అందులో జీరో శాతం కూడా నిజాల్లేవ్. కొందరు పబ్లిసిటీ కోసం ఇలాంటి వార్తలు రాసేస్తున్నారు. దయచేసి ఇలాంటి వార్తలు నమ్మకండి.. రాయకండి అంటూ దండం పెడుతున్న ఎమోజీతో శోభిత ట్వీట్ చేసింది. ఈమె ట్వీట్‌కు పలువురు నెటిజన్లు పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతున్నారు. 

శోభిత క్లారిటీ ఇచ్చారు గనుక ఇకనైనా ఈ పుకార్లకు ఫుల్‌స్టాప్ పడుతుందో లేదో చూడాలి. కాగా.. ఇప్పటికే పలువురు పేర్లు తెరపైకి రాగా.. క్రీడాకారిణి గుత్తా జ్వాల, సింగర్ హేమచంద్రతో పాటు పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యి క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Heroine Reaction on Bigg Boss Consistent Rumours:

Sobhita Reacted on Bigg Boss Rumours in her Twitter

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ