వరస హిట్స్ తో దూసుకుపోతున్న డైరెక్టర్ అనిల్ రావిపూడికి సూపర్ స్టార్ మహేష్ లాంటి హీరో దొరికితే ఏం అవుతుంది? ఆ సినిమాకి ఇప్పటినుండే అంచనాలు పెరిగిపోతాయి. అలానే బిజినెస్ కూడా ఒక రేంజ్ లో జరుగుతుంది. మనం అనుకున్నట్టే బిజినెస్ ఒక రేంజ్ లో జరిగే అవకాశముంది. ఈసినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లకుండానే శాటిలైట్ హక్కులు డీల్ కుదిరిపోయిందట.
మహేష్ కెరీర్ లో ఎన్నడూ లేనివిధంగా సరిలేరు నీకెవ్వరు శాటిలైట్ రేట్ బాంబ్ లా పేలింది. అక్షరాలా 16.5 కోట్ల రేంజ్ లో ఆ సినిమా శాటిలైట్ హక్కులను జెమిని టీవీ దక్కించుకుంది. మహర్షి 12 కోట్లుకి వెళ్తే ఈమూవీ ఏకంగా 16.5 కోట్లుకి వెళ్ళింది. కేవలం శాటిలైట్ ను మాత్రమే జెమిని తీసుకుంది. ఇంకా డిజిటల్, అడియో, హిందీ డబ్బింగ్ ఇవన్నీ వున్నాయి. అన్ని కలుపుకుంటే 45 - 50 కోట్లు వరకు వచ్చే అవకాశముంది.
అయితే ఇక్కడ ఇంకో విషయం ఏటంటే... నాన్ థియేటర్ రైట్స్ అన్నీ మహేష్ వే. ఇది నిర్మాతలతో కుదుర్చుకున్న ఒప్పందమే. అంటే అనిల్ సుంకర, దిల్ రాజు లకు థియేటర్ రైట్స్, మహేష్ బాబుకు నాన్ థియేటర్ రైట్స్. ఈమూవీకి మహేష్ కి నో రెమ్యూనరేషన్. అందుకే నాన్ థియేటర్ రైట్స్ తీసుకుంటున్నాడు. అంటే దీనిప్రకారం మహేష్ రెమ్యూనరేషన్ కింద 50 కోట్లకు పైగానే వస్తుందన్నమాట. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈసినిమాలో విజయశాంతి ఓ కీలక పాత్రలో నటిస్తుంది.