Advertisementt

నాని గ్యాంగ్ లీడర్ కు కొత్త కష్టాలు!

Wed 26th Jun 2019 09:35 AM
hero nani,gang leader,agent sai srinivasa atreya,movies,stories  నాని గ్యాంగ్ లీడర్ కు కొత్త కష్టాలు!
New Problems to Nani Gang Leader నాని గ్యాంగ్ లీడర్ కు కొత్త కష్టాలు!
Advertisement
Ads by CJ

యమా ఊపు మీద సినిమాలు చేస్తున్న నాని ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘గ్యాంగ్ లీడర్’ తో పాటుగా... ఇంద్రగంటి డైరెక్షన్ లో ‘వి’ సినిమాలో నటిస్తున్నాడు. అయితే నాని విక్రమ్ కుమార్ దర్శత్వంలో మొదలెట్టిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి టైటిల్ వివాదంలో చిక్కుకుంది. తాజాగా మరో సమస్యలో ‘గ్యాంగ్ లీడర్’ పడింది అంటూ ఫిలింనగర్ టాక్. ఇంతకీ ఆ విషయమేమిటంటే.. నాని ‘గ్యాంగ్ లీడర్’ సినిమా ప్రస్తుతం ఇంకా ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఉంది. అయితే ‘గ్యాంగ్ లీడర్’ లోని సన్నివేశాలకు, తాజాగా విడుదలైన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాలోని సన్నివేశాలకు దగ్గర పోలిక ఉన్నట్లుగా టాక్.

నవీన్ పోలిశెట్టి హీరోగా తెరకెక్కిన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ తాజాగా విడుదలై సక్సెస్ సాధించింది. మంచి సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈసినిమాకి ప్రేక్షకుల స్పందన బావుంది. ఇన్వెస్టిగేష‌న్ మోడ్‌లో సాగే ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’కి నాని ‘గ్యాంగ్ లీడర్’ సినిమాకి దగ్గర పోలికలున్నాయంటున్నారు. నాని ‘గ్యాంగ్ లీడర్’ కూడా ఇన్వెస్టిగేష‌న్ మోడ్‌లో సాగే సినిమాలానే ఉంటుందట. గ్యాంగ్ లీడర్ క‌థ‌లో మ‌లుపులు చాలా ఉంటాయ‌ట‌. అలాంటి కొన్ని మ‌లుపులు, ఎపిసోడ్స్ ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ లో కూడా ఉంటాయి. 

దాంతో గ్యాంగ్ లీడ‌ర్‌ ఇప్పుడు ఇబ్బందుల్లో ప‌డిన‌ట్టు స‌మాచారం. మరి అదే నిజమైతే.. గ్యాంగ్ లీడర్ స్క్రిప్ట్ ని దర్శకుడు విక్రమ్ కుమార్ మార్చుకోవాల్సిందే. ఇప్పటికే నాని, విక్రమ్ కుమార్ అదే దిశగా అడుగులు వేస్తున్నారని వినికిడి.

New Problems to Nani Gang Leader:

Similarities Between Nani Gang Leader and Agent Sai Srinivasa Atreya

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ