Advertisementt

ఇక సాయితేజ్‌కి ‘ప్రతిరోజూ పండగే’ అవుతుందా?

Mon 24th Jun 2019 10:38 PM
sai tej,maruthi,prathi roju pandage movie,opening,details  ఇక సాయితేజ్‌కి ‘ప్రతిరోజూ పండగే’ అవుతుందా?
Prathi Roju Pandage Movie launched ఇక సాయితేజ్‌కి ‘ప్రతిరోజూ పండగే’ అవుతుందా?
Advertisement
Ads by CJ

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో, సాయి తేజ్ హీరోగా, మారుతి దర్శకత్వంలో, బన్ని వాస్ నిర్మాతగా ‘ప్రతిరోజు పండగే’ ఘనంగా ప్రారంభం

ఇటీవలే చిత్రలహరి చిత్రంతో మంచి విజయం అందుకొన్న సుప్రీం హీరో సాయి తేజ్ హీరోగా.... భలే భలే మగాడివోయ్, మహానుభావుడు వంటి బంపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన మారుతి దర్శకుడిగా, ఎన్నో ఇండస్ట్రీ హిట్ చిత్రాల్ని నిర్మించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో, వంద కోట్ల క్లబ్ లో చేరిన గీత గోవందం వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన బన్నీ వాస్ నిర్మాతగా ‘ప్రతిరోజు పండగే’ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్ లోని ఫిలింనగర్ దైవ సన్నిధానంలో ఘనంగా జరిగింది. GA2UV పిక్చర్స్ బ్యానర్లో ఈ చిత్రాన్ని గ్రాండియర్ గా నిర్మించనున్నారు. 

సాయి తేజ్ - మారుతి కాంబినేష‌న్

ఫుల్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్స్ తెర‌కెక్కించ‌డంలో ద‌ర్శ‌కులు మారుతి త‌న‌కంటూ ఓ ముద్ర వేసుకున్నారు. ఇంత‌వ‌ర‌కు మారుతి డైరెక్ష‌న్ లో వ‌చ్చిన భ‌లే భ‌లే మ‌గాడివోయ్, మ‌హానుభావుడు వంటి చిత్రాలు బ్లాక్ బ‌స్ట‌ర్స్ హిట్స్ గా నిలిచాయి. ఇక తాజాగా వ‌చ్చిన చిత్రల‌హ‌రి సినిమాతో హీరో సాయితేజ కూడా హిట్ అందుకుని అటు మాస్ ఆడియన్స్ ని ఇటు క్లాస్ ఆడియన్స్ ని విశేషంగా ఆక‌ట్టుకున్నారు. ఈ నేప‌థ్యంలో సాయితేజ‌, మారుతి కాంబినేష‌న్ లో తెర‌కెక్క‌నున్న ప్ర‌తిరోజు పండగే పై భారీగా అంచనాలు ఏర్ప‌డుతున్నాయి. 

GA2 - UV పిక్చర్స్ కాంబినేష‌న్

టాలీవుడ్ లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు జీఏ 2, యూవీ క్రియేష‌న్స్ సంయుక్తంగా జీఏ2యూవీ పిక్చ‌ర్స్ సంస్థ‌గా ఏర్ప‌డి క్రేజీ కాంబినేష‌న్స్ తో, ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకునే రీతిన సినిమాల‌ను నిర్మిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాత శ్రీ అల్లు అర‌వింద్ గారి నిర్మాణ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో, నిర్మాత‌లు బ‌న్నీవాస్, వంశీ, ప్ర‌మోద్, విక్కీలు సార‌ధ్యంలో ఇప్ప‌టికే ఈ బ్యాన‌ర్ నుంచి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ వ‌చ్చాయి. గ‌తంలో ఈ బ్యాన‌ర్ నుంచి మారుతి డైరెక్ష‌న్ లో వ‌చ్చిన భ‌లే భ‌లే మ‌గాడివోయ్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన సంగ‌తి తెలిసిందే. ఇదే రీతిన మంచి విజ‌యం అందుకునే దిశ‌గా సాయితేజ్ హీరోగా మారుతి డైరెక్ష‌న్ లో ప్ర‌తిరోజు పండగే తెర‌కెక్కుతుంది.

సుప్రీమ్ హీరో సాయితేజ్ - ఢిల్లీ బ్యూటీ రాశీ ఖ‌న్నా కాంబినేష‌న్

సుప్రీమ్ హీరో సాయి తేజ్, ఢిల్లీ బ్యూటీ రాశీ ఖ‌న్నా క‌లిసి న‌టిస్తున్నార‌నే ఎనౌన్స్ మెంట్ వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి వీరి పెయిర్ కి మంచి క్రేజ్ ఏర్ప‌డింది. సోష‌ల్ మీడియాలో సైతం ఈ జోడిపై పాజిటివ్ కామెంట్స్ వ‌చ్చాయి. గ‌తంలో వీరిద్ద‌రు క‌లిసి న‌టించిన సుప్రీమ్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ టాక్ తెచ్చుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప్ర‌తిరోజు పండగే చిత్రంలో కూడా వీరిద్ద‌రి కాంబినేష‌న్, పాత్ర‌ల‌పై ఆస‌క్తి నెల‌కొంది.

ఆక‌ట్టుకోనున్న స‌త్య‌రాజ్ - రావుర‌మేశ్ పాత్ర‌లు

క‌ట్ట‌ప్ప‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌కి మరింత చేరువైన ప్ర‌ముఖ న‌టులు స‌త్య‌రాజ్ క్యారెక్ట‌ర్ ని ఈ సినిమా ద‌ర్శ‌కులు మారుతి ప్ర‌త్యేకంగా డిజైన్ చేస్తున్నారు. అలానే ఈ సినిమాలో న‌టిస్తున్న మ‌రో న‌టుడు రావు ర‌మేశ్ పాత్ర కూడా హైలెట్ గా ఉండ‌నుంది.

నటీనటులు

సాయి తేజ్, రాశి ఖన్నా, సత్యరాజ్, విజయ కుమార్, రావ్ రమేష్, మురళీ శర్మ, అజయ్, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, సత్య శ్రీనివాస్, సుభాష్, భరత్ రెడ్డి, గాయత్రీ భార్గవి, హరితేజ, మహేష్, సుహాస్ తదితరులు

సాంకేతిక వర్గం

రచన, దర్శకత్వం - మారుతి దాసరి

సమర్పణ - అల్లు అరవింద్

ప్రొడ్యూసర్ - బన్నీ వాస్

కో ప్రొడ్యూసర్ - ఎస్.కె.ఎన్

మ్యూజిక్ డైరెక్టర్ - తమన్ .ఎస్

ఎడిటర్ - కోటగిరి వెంకటేశ్వర రావ్ (చంటి)

ఆర్ట్ డైరెక్టర్ - రవీందర్

ఎగ్జీక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ - బాబు

డిఓపి - జైకుమార్ సంపత్

పీఆర్ఓ - ఏలూరు శ్రీను

పబ్లిసిటీ డిజైనర్ - అనిల్ భాను

Prathi Roju Pandage Movie launched:

Sai Tej and Maruthi Movie Prathi Roju Pandage Movie Opening details

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ