Advertisementt

మెగా ఫ్యామిలీ హీరోలకు తేజ్ పార్టీ..!

Mon 24th Jun 2019 04:28 PM
sai tej,get together party,mega family,sai dharam tej,upasana  మెగా ఫ్యామిలీ హీరోలకు తేజ్ పార్టీ..!
Sai Tej Party to Total Mega Family మెగా ఫ్యామిలీ హీరోలకు తేజ్ పార్టీ..!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తంమ్మీద ఎంత పెద్ద బ్రేకింగ్ న్యూస్‌లు వచ్చినప్పటికీ.. మెగా ఫ్యామిలీ గురించి చిన్నపాటి వార్త అయినా అది సెన్సేషనే అవుతుంది. ఇక అసలు విషయానికొస్తే.. మెగా ఫ్యామిలీ హీరోలు రామ్ చరణ్ తేజ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్ వీళ్లంతా కలుసుకుని చాలా రోజులైంది.. అప్పుడెప్పుడో చిరు డాటర్ శ్రీజ పెళ్లికి కలుసుకున్నారు తప్ప అప్పట్నుంచి ఇంతవరకూ పెద్దగా కలుసుకోలేదు. చాలా లాంగ్ గ్యాప్ రావడంతో సాయిధరమ్ తేజ్.. ఆదివారం నాడు మెగా హీరోలందర్నీ ఇంటికి పిలిపించి మరీ పార్టీ ఇచ్చారు. 

ఇలా అందరం కలిసినట్లూ ఉంటుంది.. పార్టీ చేసుకున్నట్లు ఉంటుందని భావించిన తేజ్.. నిహారిక, శ్రీజ, కళ్యాణ్ దేవ్, సుష్మితతో పాటు అందరూ ఈ పార్టీకి విచ్చేశారు. కాగా.. ఈ పార్టీకి కొణిదెల ఫ్యామిలీకి చెందిన కజిన్స్ మాత్రమే హాజరవ్వగా చరణ్ భార్య ఉపాసన మాత్రం కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేదట. అలాగే అల్లు ఫ్యామిలీ కూడా పాల్గొనలేదు. మిస్సయిన వాళ్లంతా వారివారి పనుల్లో బిజీబిజీగా ఉండటంతో రాలేకపోయారట.

అయితే పార్టీ అనంతరం ఫొటోలకు ఫోజులిచ్చి.. వాటిని తేజ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా మెగాభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఈ ఫొటోలు చూసిన ఉప్సీ.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మెగాభిమానులు కామెంట్లు, లైక్‌లు, షేర్‌లతో హోరెత్తిస్తున్నారు.

Sai Tej Party to Total Mega Family:

Sai Tej arragned  get together Party for Mega heroes  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ