మహానటితో భారీ క్రేజ్ సొంతం చేసుకున్న కీర్తి సురేష్.. తర్వాత తెలుగులో సినిమాలు చెయ్యలేదు కానీ.. తమిళంలో వరస సినిమాలు చేసినా ప్లాప్స్ మాత్రమే కొట్టింది. చాలా రోజుల నుండి అవకాశాలు కోసం ఎదురు చూస్తున్న కీర్తి సురేష్ ఒక్కసారిగా బిజీ తారగా మారింది. బాలీవుడ్ ఆఫర్ తో పాటుగా.. తెలుగులో రెండు సినిమాల్లో నటిస్తుంది. నాగార్జున మన్మధుడు 2 లో కీర్తి సురేష్ గెస్ట్ రోల్ ప్లే చేస్తుంది. అలాగే మరో లేడి ఓరియెంటెడ్ మూవీలోను కీర్తి సురేష్ నటిస్తుంది. ఇక మన్మధుడు 2 లో ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో నాగ్ కి గర్ల్ ఫ్రెండ్ గా కీర్తి సురేష్ కనిపించబోతుందనే టాక్ ఉంది.
ఇక మన్మధుడు 2 లో కీర్తిని దగ్గరగా చూసిన నాగార్జున తన మరో సినిమా బంగార్రాజులో కీర్తి సురేష్ ని వన్ అఫ్ ద హీరోయిన్ గా సెలెక్ట్ చేస్తుందనే న్యూస్ నడుస్తుంది. నాగార్జున - రమ్యకృష్ణ - లావణ్య త్రిపాఠి కాంబోలో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ సోగ్గాడే చిన్ననాయన సినిమా తెరకెక్కించాడు. ఆ సినిమా హిట్ అవడంతో.. ఆ సినిమాకి సీక్వెల్ గా బంగార్రాజు స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు కళ్యాణ్ కృష్ణ. ఇక నాగార్జునతో పాటుగా ఈ సినిమాలో నాగ చైతన్య కూడా కీ రోల్ ప్లే చేస్తున్నాడు. అయితే బంగార్రాజులో నాగ చైతన్య సరసన నటింపజేసేందుకు కీర్తి సురేష్ పేరును పరిశీలిస్తున్నారట. మరి నాగార్జున, కీర్తి సురేష్ ని హీరోయిన్ గా అనుకున్నాడంటే అది ఫైనల్. కాకపోతే ఇంకా అధికారిక ప్రకటన రావడమే ఆలస్యం అంటున్నారు.