అఖిల్ త్వరలోనే బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో ఓ లవ్ స్టోరీ చేస్తున్నాడు. హీరోయిన్ ఎవరు అనేది ఇంకా ఫైనల్ అవ్వకుండానే ఈమూవీ సెట్స్ మీదకు వెళ్తుంది. ఈ మూవీలో హీరోయిన్ పాత్ర చాలా వెయిట్ ఉన్న పాత్ర కావడంతో కొంచెం పెద్ద హీరోయిన్ ని తీసుకోవాలని అప్పటి నుండి ఇప్పటి వరకు హీరోయిన్ కోసం మేకర్స్ సెర్చ్ చేస్తూనే ఉన్నారు. అయితే ఆ స్టార్ హీరోయిన్ ఎవరు అనేది మాత్రం ఇంకా ఫైనల్ అవ్వలేదు.
కానీ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. తాజాగా ఈ లిస్ట్ లో పూజా హెగ్డే పేరు వినిపిస్తోంది. అవును అఖిల్ తో పూజా హెగ్డే నటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇందులో కొంతవరకు నిజమే. ప్రస్తుతం పూజా చేతిలో తమిళ, తెలుగు భాషల్లో కలిపి మూడు చిత్రాలు పైగా ఉన్నాయి. ఇలాంటి టైమ్ లో ఆమె అఖిల్ సినిమా కోసం కాల్షీట్లు కేటాయిస్తుందని అనుకోలేం. అందుకే ఈ వార్త ఎవరు పెద్దగా పట్టించుకోవడం లేదు.
కాకపోతే ఈ వార్తలో నిజం లేకపోలేదు. పూజా దగ్గర ఓ సౌకర్యం ఉంది. కాస్త రెమ్యూనరేషన్ పెంచితే ఎలాగోలా ఆమె కాల్షీట్లు ఎడ్జస్ట్ చేస్తుంది. సెట్ అయితే పర్లేదు కానీ అసలు అఖిల్ పక్కన పూజా సెట్ అవుతుందా? ఏమో చూడాలి. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ రానుంది.