మలయాళంలో ప్రేమమ్ సినిమాతో బాగా పాపులర్ అయిన సాయి పల్లవి.. తెలుగులో శేఖర్ కమ్ముల దర్శత్వంలో తెరకెక్కిన ఫిదా సినిమాతో హిట్ ఎంట్రీ ఇచ్చింది. ఫిదా సినిమాలో భానుమతిగా.. తెలంగాణ యాసలో మాట్లాడుతూ.. హై బ్రీడ్ పిల్లగా అందరి ప్రశంశలు అందుకుంది. శేఖర్ కమ్ముల కూడా సాయి పల్లవి కేరెక్టర్ ని హైలెట్ చేస్తూ ఫిదా సినిమా చేసాడు. ఇక తర్వాత నాని ఎంసీఏ లోను, తమిళ సినిమాలతోను సాయి పల్లవి బిజీ అయ్యింది. కానీ ఫిదా అంత హిట్ మళ్ళీ అందుకోలేకపోయింది. కేరెక్టర్ నచ్చితేనే, కథ నచ్చితేనే సినిమాలు చేస్తానని చెప్పే సాయి పల్లవి చాలా విషయాల్లో రాంగ్ డెసిషన్ తో క్రేజ్ కోల్పోయింది. తాజాగా ఎన్జీకే సినిమాతో అట్టర్ ప్లాప్ కొట్టిన సాయి పల్లవి.. తెలుగులో విరాట పర్వం సినిమాలో లీడ్ రోల్ పోషిస్తుంది.
తాజాగా తనకి ఫిదా లాంటి హిట్ ఇచ్చిన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్యతో జోడి కట్టబోతుంది. మరి ఫిదా కెరీర్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవికి మళ్ళీ శేఖర్ కమ్ముల సినిమాతో దశ తిరగబోతుందా? అంటే అవుననే సమాధానమే వస్తుంది. శేఖర్ కమ్ముల సాయి పల్లవి కేరెక్టర్ ని మరోమారు హైలెట్ చేయబోతున్నాడనే న్యూస్ నడుస్తుంది. ఇక నాగ చైతన్య, శేఖర్ కమ్ముల సినిమాతో నటిస్తున్నట్లుగా కన్ఫర్మ్ చేస్తూ.. చాలా రోజుల నుండి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించాలనుకుంటున్నట్లుగా.... అది ఇన్నాళ్లకు తీరబోతున్నట్లుగా ట్వీట్ కూడా చేసాడు. మరి చైతు, సాయి పల్లవి డామినేషన్‌ని తట్టుకోవడానికి మెంటల్ గా ప్రిపేర్ అవుతున్నట్లుగా కనబడుతుంది. ఫిదా లాంటి హిట్ తో సాయి పల్లవి మరోసారి క్రేజ్ కొట్టేయడం ఖాయమంటున్నారు.