Advertisementt

నాగ్, రవితేజపై హరీష్‌రావు ఫ్యాన్స్ ఆగ్రహం

Sat 22nd Jun 2019 04:28 PM
nagarjuna,raviteja,kaleswaram project,harish rao,fans  నాగ్, రవితేజపై హరీష్‌రావు ఫ్యాన్స్ ఆగ్రహం
Harish Rao Fans Fires on Nagarjuna and Raviteja నాగ్, రవితేజపై హరీష్‌రావు ఫ్యాన్స్ ఆగ్రహం
Advertisement
Ads by CJ

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వర ప్రాజెక్టు ప్రారంభోత్సవం శుక్రవారం నాడు ఘనంగా జరిగిన విషయం విదితమే. ఈ సందర్భంగా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా తెలంగాణ సర్కార్‌కు అభినందనలు తెలిపారు. ముఖ్యంగా టాలీవుడ్ హీరోలు అక్కినేని నాగార్జున, రవితేజ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ ఇద్దరు ట్వీట్లు చేశారు అంతా బాగుంది.. అంతటితో ఆగుంటే సరిపోయేది అయితే.. #kaleswaram అని ట్యాగ్ చేశారు అది కూడా ఓకే @KTRTRS @TelanganaCMO అని ట్యాగ్ చేసి ట్రోలింగ్‌కు గురయ్యారు. ఈ రెండు ట్యాగ్‌లు చేసిన హీరోలు కాళేశ్వరం మూలపురుషుడు, ప్రాజెక్ట్ పూర్తి కావడానికి కర్త, కర్మ, క్రియ అయిన మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును మరిచారని ఆయన అభిమానులు, పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు కన్నెర్రజేస్తున్నారు.

మొత్తానికి చూస్తే.. ఈ ట్రోలింగ్స్ చూసిన నాగ్, రవితేజ ట్వీట్ చేసి తప్పుచేశామని అనుకుని ఉంటారేమో. కాగా.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హరీష్ హాజరుకాలేదు. అయితే సిద్దిపేట జిల్లాలో జరిగిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ వేడుకలకే హరీష్ పరిమితమయ్యారు.

Harish Rao Fans Fires on Nagarjuna and Raviteja:

Trolling on Nagarjuna and Raviteja

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ