Advertisementt

సమంత టైమింగ్ కోసం వెయిటింగ్..!

Sat 22nd Jun 2019 03:59 PM
samantha,oh baby,entertainment,comedy,heroine samantha  సమంత టైమింగ్ కోసం వెయిటింగ్..!
Samantha Oh Baby Trailer released సమంత టైమింగ్ కోసం వెయిటింగ్..!
Advertisement
Ads by CJ

సమంత లాంటి స్టార్ హీరోయిన్ నటించిన ‘యు టర్న్’ మూవీ ఎందుకో హిట్ అవ్వలేదు. అదేంటి అని ఆలోచిస్తే సామ్ నుంచి జనాలు సీరియస్ సినిమాలు ఆశించట్లేదని అర్ధం అయింది. ఆమె నుంచి ఎక్కువగా కోరుకునేది ఎంటర్టైన్మెంట్. సామ్ తన కెరీర్ లో మొదటిసారిగా ‘అఆ’లో కామెడీ చేసింది. అది బాగా వర్క్ అవుట్ అయింది.

‘అఆ’ సినిమాకి త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ తో పాటు సామ్ పంచిన వినోదమే ప్రధాన ఆకర్షణ. దాంతో సామ్ మరోసారి ఎంటర్టైనర్ జోనర్ రావాలని ఫిక్స్ అయ్యి నందిని రెడ్డి డైరెక్షన్ లో ‘ఓ బేబీ’ చేసింది.ఇది ఒక కొరియన్ మూవీ కి రీమేక్ గా వస్తుంది. కొరియన్ మూవీ మనకు ఎందుకు సూట్ అవ్వుతుందని ఆలోచిస్తే మీరు పప్పులో కాలు వేసినట్టే. టీజర్, ట్రైలర్ చూస్తే సినిమా ప్రధానంగా కామెడీ మీద నడుస్తుందని అర్ధం అవుతుంది.

సామ్ 70 ఏళ్ల నుంచి 24 ఏళ్ల వయసుకు మారిపోయిన బామ్మ పాత్రలో అదరకొట్టేసిందని అంటున్నారు. ఆమె కామెడీ టైమింగ్ ఈమూవీకి ప్రధాన ఆకర్షణగా మారేలా కనిపిస్తోంది. లాస్ట్ లో రెండు మూడు సీన్స్ కంటతడి పెట్టించినా ఓవరాల్ గా మూవీ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ అని చెబుతున్నారు. మరి ప్రేక్షకులు రిలీజ్ అయిన తరువాత ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి. జులై 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Samantha Oh Baby Trailer released:

Samantha Timing Comedy in Oh Baby Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ