హిందీలో అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ ఈరోజు గ్రాండ్ గా రిలీజ్ కానుంది. హిందీ లో కూడా సందీప్ వంగానే డైరెక్ట్ చేసాడు. సల్మాన్ ఖాన్ లేటెస్ట్ మూవీ భారత్ వచ్చి రెండు వారాలు ఆవుతుంది. ఈమూవీ రిలీజ్ అయిన అన్ని చోట్ల స్లో గా నడుస్తుంది. సో ఇప్పుడంతా కబీర్ సింగ్ పై హోప్స్ పెట్టుకున్నారు. ఇక ఈసినిమా హిట్ అయితే విక్రమ్ కొడుకు ధృవ్ పై చాలా ఒత్తిడి పడే అవకాశముంది. అదేంటి అనుకుంటున్నారా?
విక్రమ్ కొడుకు మొదటి సినిమా కూడా అర్జున్ రెడ్డి రీమేకే కదా. దీనికి ఆదిత్య వర్మ అనే టైటిల్ పెట్టారు. ఈచిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది లేటెస్ట్ గా ఫస్ట్ కాపీ కూడా రెడీ అయిపోయింది. రీసెంట్ గా టీజర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది కానీ ఈరోజు రిలీజ్ అవుతున్న కబీర్ సింగ్ కు బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తే కనక అప్పుడు ధృవ్ ఒక్క విజయ్ దేవరకొండను మరిపిస్తే సరిపోదు షాహిద్ కపూర్ ని కూడా టార్గెట్ చేయాల్సివస్తుంది. ఇద్దరి పేరు ఉన్న హీరోస్ ని టార్గెట్ చేయడం అంటే మాములు విషయం కాదు.
అర్జున్ రెడ్డి కి ముందు విజయ్ సినిమాలు చేసిన అనుభవం ఉంది. అలానే షాహిద్ కపూర్ వచ్చి దశాబ్దం ఎప్పుడో దాటేసింది. అయితే వీళ్ళిద్దరితో డెబ్యూ మూవీ చేస్తున్న ధృవ్ కి పోలిక పెట్టడం సబబు కాదని సోషల్ మీడియాలో కొంతమంది వాదన. మరి తన తొలి సినిమాతోనే ధృవ్ అందరి నోరులు మూపిస్తాడా?