Advertisementt

‘రాజ్ ధూత్’ తొలి సింగిల్ విడుద‌లైంది

Fri 21st Jun 2019 07:09 PM
real star,srihari son,rajdhoot,first song,meghamsh,radio city  ‘రాజ్ ధూత్’ తొలి సింగిల్ విడుద‌లైంది
RajDhoot First lyrical song Released ‘రాజ్ ధూత్’ తొలి సింగిల్ విడుద‌లైంది
Advertisement
Ads by CJ
  • రేడియో సిటీలో రాజ్ ధూత్ ఫ‌స్ట్ సింగిల్ విడుద‌ల‌
  • రాజ్ దూత్ నుంచి ‘మ‌న‌సున మ‌న‌సున ఏదో ఆశ’ సాంగ్ విడుద‌ల‌

స్వ‌ర్గీయ రియ‌ల్ స్టార్ శ్రీహ‌రి త‌న‌యుడు  మేఘామ్ష్ క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం అవుతోన్న చిత్రం ‘రాజ్ ధూత్’. న‌క్ష‌త్ర‌, ప్రియాంక వ‌ర్మ హీరోయిన్లు. ల‌క్ష్య ప్రొడ‌క్ష‌న్స్ పతాకంపై అర్జున్ -కార్తీక్ ద‌ర్శ‌క‌త్వంలో ఎమ్.ఎల్.వి స‌త్య‌నారాయ‌ణ‌(స‌త్తిబాబు) నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజైన టీజ‌ర్ కు సోష‌ల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా లిరిక‌ల్ సింగిల్స్ తో శ్రోత‌ల్ని మెప్పించడానికి రెడీ అయింది యూనిట్. దీనిలో భాగంగా సినిమాలోని తొలి సింగిల్ ‘మ‌న‌సున మ‌న‌సున ఏదో ఆశా’ అంటూ సాగే మెలోడీ సాంగ్ ను హైద‌రాబాద్  రేడియో సిటీలో విడుద‌ల చేసారు. ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర హీరో మేఘామ్ష్, ద‌ర్శ‌కుల‌లో ఒక‌రైన కార్తీక్ పాల్గొన్నారు. 

ఈ సంద‌ర్భంగా హీరో మేఘామ్ష్ మాట్లాడుతూ..‘‘సినిమాలో మొత్తం నాలుగు పాట‌లున్నాయి. ప్ర‌తీ పాట ప్ర‌త్యేకంగా ఉంటుంది. క‌థ‌లో ఇమిడిపోయే పాట‌ల‌వి. ఇప్పుడు విడుద‌ల చేసిన మ‌న‌సున మ‌న‌సున సాంగ్ ప్రేమలో భావాల‌ను ఎలివేట్ చేస్తుంది. ఈ పాట షూటింగ్ స‌మ‌యంలో చాలా ఎంజాయ్ చేసాను. శ్రోత‌ల్ని కూడా మెప్పిస్తుంది. మిగతా పాట‌లు చ‌క్క‌గా కుదిరాయి. ఇటీవ‌ల రిలీజ్ అయిన టీజ‌ర్ కు మంచి రెస్పాన్స్  వ‌చ్చింది. టీజ‌ర్ ను మెచ్చిన ప్ర‌తీ ఒక్క‌రికీ కృత‌జ్ఞ‌త‌లు’’ అని అన్నారు.

ద‌ర్శ‌కుల‌లో ఒక‌రైన కార్తీక్ మాట్లాడుతూ.. ‘‘మంచి  మెలోడీ సాంగ్ ఇది. ఈ పాట‌ సాహిత్యం సినిమాలో ఎమోష‌న్ ని ఎలివేట్ చేస్తుంది. నాకు క‌రుణాక‌ర‌న్ సినిమాలో పాట‌లంటే బాగా ఇష్టం. ఈ పాట‌ని ఆయ‌న స్టైల్లో చేసే ప్ర‌య‌త్నం చేసాం. కిట్టు అందించిన‌ లిరిక్స్, వ‌రుణ్ సునీల్ సంగీతం, సిద్ధార్థ్ మీన‌న్ వాయిస్ చ‌క్క‌గా కుదిరాయి. ముఖ్యంగా యూత్ కి బాగా క‌నెక్ట్ అయ్యే పాట‌. సినిమాలో మిగ‌తా పాట‌లు అంద‌ర్ని అల‌రిస్తాయి’’ అని తెలిపారు. 

ఈ చిత్రంలో కోట శ్రీనివాస‌రావు, ఆదిత్య మీన‌న్, దేవీ ప్ర‌సాద్, అనిష్ కురివెళ్ల‌, మ‌నోబాల‌, వేణుగోపాల్, దువ్వాసి మోహ‌న్, సూర్య ర‌వివ‌ర్మ‌, సుద‌ర్శ‌న్, చిత్రం  శ్రీను, వేణు, ప్ర‌సాద్, సంతోష్ అడ్డూరి, భ‌ద్రం, జెమిని అశోక్, సూర్య వ‌ర్య‌, రాజేష్ ఉల్లి, మృణాల్, మ్యాడి, మ‌హ‌ర్షి, స్వాగ్, శివ‌, బిందు, రాజేశ్వ‌రి, శిరీష్, న‌ళిని,మాస్ట‌ర్ ఈశాన్ న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి ర‌చ‌నా స‌హ‌కారం:  వెంకట్ డి. పాటి, పాట‌లు: కిట్టు విస్సా ప్ర‌గ‌డ‌, రాంబాబు గోసాల‌, కొరియోగ్ర‌ఫీ: విశ్వ ర‌ఘు, రాజ్ కృష్ణ‌, ఫైట్స్: న‌ందు, క‌ళ‌: ముర‌ళీ వీర‌వ‌ల్లి, ఎడిటింగ్: విజ‌య్  వ‌ర్ద‌న్.కె, నేప‌థ్య సంగీతం: జెబీ, సినిమాటోగ్ర‌పీ: విద్యాసాగ‌ర్ చింత‌, సంగీతం: వ‌రుణ్ సునీల్, కో డైరెక్ట‌ర్: శ‌రణ్ వేదుల‌, ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌: ఎమ్.ఎస్ కుమార్.

RajDhoot First lyrical song Released:

Real Star Srihari Son acted RajDhoot Movie First song Released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ