Advertisementt

తమన్నాతో.. ‘రాజుగారి గ‌ది 3’ మొదలైంది

Fri 21st Jun 2019 02:42 PM
rajugari gadhi 3,tamanna,dil raju,ohmkar,rajugari gadhi 3 opening  తమన్నాతో.. ‘రాజుగారి గ‌ది 3’ మొదలైంది
Rajugari Gadhi 3 Movie Launched తమన్నాతో.. ‘రాజుగారి గ‌ది 3’ మొదలైంది
Advertisement
Ads by CJ

ఓంకార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన హార‌ర్ కామెడీ చిత్రం ‘రాజుగారి గ‌ది’ ఎంత‌టి విజ‌యాన్ని సాధించిందో అంద‌రికీ తెలిసిందే. ఆ సినిమాకు ఫ్రాంచైజీగా ‘రాజుగారి గ‌ది 3’ గురువారం లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ఓక్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సినిమా నిర్మిత‌మ‌వుతుంది. ఈ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మానికి దిల్‌రాజు ముఖ్య అతిథిగా హాజ‌రై ముహూర్త‌పు స‌న్నివేశానికి క్లాప్ కొట్టారు. స్టార్ మా బిజినెస్ హెడ్ అలోక్ జైన్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. 

‘రాజుగారి గ‌ది 3’లో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా భాటియా ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తుండ‌గా అశ్విన్ ముఖ్య పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఊర్వ‌శి, అలీ, బ్ర‌హ్మాజీ, ప్ర‌భాస్ శ్రీను, హ‌రితేజ‌, అజ‌య్‌ఘోష్ ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. శుక్ర‌వారం నుండి సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ హైద‌రాబాద్‌లో ప్రారంభం అవుతుంది. ఛోటా కె.నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. సాయిమాధ‌వ్ బుర్రా డైలాగ్స్‌, గౌతంరాజు ఎడిటింగ్‌, సాహి సురేశ్ ప్రొడ‌క్ష‌న్ డిజైనర్‌గా, వెంక‌ట్ ఫైట్ మాస్ట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. 

న‌టీన‌టులు:

త‌మ‌న్నా భాటియా

అశ్విన్ బాబు

అలీ

బ్ర‌హ్మాజీ

ప్ర‌భాస్ శ్రీను

హ‌రితేజ‌

అజ‌య్ ఘోష్‌

ఊర్వ‌శి త‌దిత‌రులు

 

సాంకేతిక వ‌ర్గం:

ద‌ర్శ‌క‌త్వం: ఓంకార్‌

బ్యాన‌ర్‌: ఓక్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: క‌ల్యాణి చ‌క్ర‌వ‌ర్తి

సినిమాటోగ్ర‌ఫీ: ఛోటా కె.నాయుడు

ఎడిట‌ర్‌: గౌతంరాజు

ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: సాహి సురేశ్‌

డైలాగ్స్‌: సాయిమాధ‌వ్ బుర్రా

స్టంట్స్‌: వెంక‌ట్‌

పి.ఆర్‌.ఓ: వంశీ శేఖ‌ర్‌

Rajugari Gadhi 3 Movie Launched:

Rajugari gadhi 3 Movie Opening details

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ