విజయ్ దేవరకొండకి స్టార్ ఇమేజ్ వచ్చినా మాట వాస్తవమే. అయితే దర్శకుల పనిలో వేలు పెడతాడా? ఇదివరకు మార్కెటింగ్ వరకే ఇన్‌వాల్వ్ అయిన విజయ్ ఇప్పుడు డైరెక్షన్ లో కూడా వేలు పెడుతున్నాడా?. గీత గోవిందం తరువాత తన రేంజ్ మారిపోవడంతో మనోడికి జాగ్రత్తలు ఎక్కువ అయిపోయాయి. దాంతో దర్శకుల పనిలోను వేళ్లు బాగా పెడుతున్నాడని చెవులు కొరుక్కుంటున్నారు సినీ జనాలు.
తన లేటెస్ట్ చిత్రం ‘డియర్ కామ్రేడ్’ చిత్రానికి దేవరకొండ ఓవర్‌గా ఇన్‌వాల్వ్ అవుతున్నాడట. ఏ సీన్ ఉండాలి, ఏ సీన్ తీసేయాలి అనేది కూడా విజయ్ చెప్పడంతో డైరెక్టర్ భరత్ కమ్మ అలిగి పోస్ట్ ప్రొడక్షన్ పనులకి దూరంగా ఉంటున్నాడని టాక్ నడుస్తుంది. అయిన కానీ విజయ్ కూసింత కూడా ఫీల్ అవ్వడంలేదట. తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడల. అయితే డైరెక్టర్ తో గొడవ పడడం లాంటిది చేయకుండా అతనితో టచ్‌లోనే వుంటున్నాడని, ఎప్పటికప్పుడు వాట్సాప్‌లో అప్‌డేట్స్ ఇస్తున్నాడని ఇండస్ట్రీలో చెబుతున్నారు.
దేవరకొండతో సినిమా చేస్తే మంచి పేరు వస్తుంది అనేదానికన్నా అతని ఇన్‌వాల్వ్‌మెంట్ ఎక్కువ ఉంటుందనే దాని గురించి భయపడుతున్నారు డైరెక్టర్స్.