మంచు విష్ణు కాస్త యావరేజ్ హిట్స్ తో కెరీర్ ని లాగించాడు. మధ్యలో కెరీర్ ని గాడిలో పెట్టుకున్నాడు అనుకున్న టైం లో మళ్ళీ గాడి తప్పాడు. అట్టర్ ప్లాప్ మూవీస్ తో మార్కెట్ మొత్తం పోగొట్టుకున్నాడు. మధ్యలో సినిమాలు వదిలేశాడేమో అనుకున్న టైం లో మళ్ళీ మంచు విష్ణు ఓటర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోయాడు. కానీ ఓటర్ సినిమా వివాదాల సుడిగుండంలో ఇరుక్కుంది. దర్శకుడు కార్తీక్ కి మంచు విష్ణు కి మధ్యన ఓటర్ హక్కుల విషయంలో విభేదాలు వచ్చాయి. మంచు విష్ణు, కార్తీక్ ని బ్లాక్ మెయిల్ చేశాడంటూ స్వయానా ఓటర్ దర్శకుడు కార్తీక్ చెప్పాడు. అయినా మంచు విష్ణు ఆ విషయమై స్పందించలేదు.
తాజాగా రేపు శుక్రవారం ఓటర్ సినిమా థియేటర్స్ లోకి రాబోతుంది. అసలు ఈ సినిమా విడుదల అని ప్రకటించడం తప్ప.. సినిమా ప్రమోషన్స్ ఏం లేవు. అసలు మంచు విష్ణు అయితే ఓటర్ లో తాను హీరో కాదన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. ఇక ఓటర్ దర్శకుడు కార్తీక్ రెడ్డి ఎక్కడున్నాడో తెలియదు. కానీ ఓటర్ నిర్మాత మాత్రం సినిమాని ఎలాగోలా అమ్మేసి గట్టెక్కాలని చూస్తున్నాడు. అయితే ఓటర్ నిర్మాతకి ఇప్పుడు ఓటర్ సినిమా విడుదల విషయంలో అనేక అడ్డంకులు మొదలయ్యాయి. ఓటర్ సినిమాకి ఒక్క థియేటర్ కూడా దొరకడం లేదు.
ఈ శుక్రవారం నాలుగైదు సినిమాలు విడుదలవుతున్నాయి కాబట్టి.. అందులో ఓటర్ కూడా ఒకటనుకున్నారు.. కానీ ఇప్పుడు ఓటర్ సినిమాకి థియేటర్ దొరకని స్థితి. పాపం నిర్మాత ఏదోలా తంటాలు పడి సినిమాని వదిలించుకుందామనుకుంటే.... ఇదెక్కడి పాపమో అర్ధం కావడం లేదు. కనీసం విష్ణు ఓటర్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటే అయినా.. సినిమా మీద ప్రేక్షకుల్లో కొద్దిగా ఆసక్తి పెరుగుతుంది. కానీ విష్ణు మాత్రం మనకెందుకులే అని కూర్చున్నాడు.