Advertisementt

షూటింగ్‌లో నటీమణుల రచ్చ.. కేసు నమోదు

Wed 19th Jun 2019 04:38 PM
raga madhuri,jyothi,telugu serial,shooting spot,fighting  షూటింగ్‌లో నటీమణుల రచ్చ.. కేసు నమోదు
fighting between Telugu Serial Actress షూటింగ్‌లో నటీమణుల రచ్చ.. కేసు నమోదు
Advertisement
Ads by CJ

తెలుగు సీరియల్ షూటింగ్‌లో నటి రాగ మాధురి- జ్యోతి మధ్య గొడవ జరిగింది. దీంతో రంగంలోకి దిగిన జ్యోతి అనుచరులు మాధురిపై దాడికి పాల్పడ్డారు. ఈ వ్యవహారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు చేరింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సెక్షన్ 353, 323, 506 కింద ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. అంతేకాదు.. జ్యోతిని పీఎస్‌కు పిలిపించి విచారించారు.

వివరాల్లోకెళితే.. మంగళవారం నాడు.. రోజు మాదిరిగానే రాగ మాధురి షూటింగ్ వెళ్లింది. అయితే స్పాట్‌లో తన గోల్డ్ చైన్ మిస్ అయ్యిందని.. అక్కడున్న అందర్నీ అడిగింది. ఎంతకీ కనిపించకపోవడంతో జ్యోతి అనే నటిపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. సరిగ్గా ఫిర్యాదు చేస్తున్న టైమ్‌లో ఉదయం రాగమాధురి వెళ్లిన క్యాబ్ డ్రైవర్ కాల్ చేసి మేడం మీ చైన్ మిస్సయ్యిందని చెప్పాడు. దీంతో కంగుతిన్న రాగ మాధురి.. ఆ చైన్ పోలీసులకు అందించిన అనంతరం ఆమె తీసుకుంది. అయితే ఇక్కడితో ఈ వివాదం ముగిసింది. యథావిథిగా జ్యోతి-రాగ మాధురి షూటింగ్ స్పాట్‌కు వెళ్లారు.

తనపైనే ఫిర్యాదు చేసి స్టేషన్ మెట్లెక్కించి బద్నాం చేస్తుందా..? అని జ్యోతి ఆగ్రహానికి లోనై.. రాగమాధురిని తిట్టి అనంతరం ఆమె.. తన తమ్ముడితో పాటు మరో ఇద్దరిని పిలిపించి రాగ మాధురిపై దాడికి పాల్పడ్డారు. దీంతో మళ్లీ వివాదం పీఎస్‌కు చేరింది. ఆ గొడవ నుంచి తప్పించుకున్న రాగమాధురి మళ్లీ పోలీసులను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు జ్యోతి, ఆమె తమ్ముడు, అనుచరులపై సెక్షన్ 353, 323, 506 కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ వ్యవహారం ఎంత వరకు వెళ్తుందో వేచి చూడాల్సిందే.

fighting between Telugu Serial Actress:

Raga Madhuri vs Jyothy at shooting spot

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ