సినిమా హిట్ అయితేనే హీరో కైనా హీరోయినా కైనా దర్శకుడికైనా ఎవరికైనా క్రేజ్ ఉండేది. స్టార్ హీరోలకైతే మళ్ళీ మరో సినిమా చేసినా వారి మార్కెట్ కానీ క్రేజ్ కానీ తగ్గదు. కానీ హీరోయిన్స్ పరిస్థితి దర్శకుడి పరిస్థితి మరీ ఘోరంగా ఉంటుంది. భరత్ అనే నేనుతో హీరోయిన్ గా బాలీవుడ్ నుండి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన కియారా అద్వానీకి వినయ విధేయరామ ప్లాప్ బాగా దెబ్బేసింది. వినయ విధేయరామ హిట్ అయితే అమ్మడుకి త్రివిక్రమ్ - బన్నీ సినిమాలో ఛాన్స్ వచ్చేది. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో కియారాకి తెలుగులో అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు అదే విషయాన్నీ అమ్మడు కూడా ఒప్పుకుంటుంది. హిట్ ఉంటేనే దర్శక నిర్మాతలు వెనక పడతారని.... హిట్ లేకపోతే కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చెయ్యరని అంటుంది.
తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తన మొదటి సినిమా ప్లాప్ అయినప్పుడు.. అందరూ నన్ను తప్పించుకు తిరిగారని.. కానీ ఇప్పుడు కాస్త క్రేజ్ వచ్చాక తన వెంట పడుతున్నారని అంటుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో కబీర్ సింగ్ అనే అర్జున్ రెడ్డి రీమేక్ లో నటిస్తుంది కియారా. ఆ సినిమాలో షాహిద్ కపూర్ తో కలిసి లిప్ లాక్ సన్నివేశాల్లో సెగలు పుట్టిస్తుంది. ప్రస్తుతం తాను సక్సెస్ లో ఉండబట్టి ఇప్పుడు తనకు మంచి అవకాశాలు వస్తున్నాయని... కానీ నాకు నచ్చితేనే సినిమాలు ఒప్పుకుంటున్నానని చెబుతుంది కియారా అద్వానీ.