కమెడియన్ పృధ్వీ తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే మంచి మంచి సినిమాలు చేస్తూ మంచి పేరు తెప్పించుకుంటున్నాడు. వరుసగా కమెడియన్ అవకాశాలు దక్కించుకుంటూ సినిమాలు మీద సినిమాలు చేస్తున్న పృధ్వీ రీసెంట్ గా వైసిపి తరుఫున ప్రచారం చేసి పవన్ కళ్యాణ్ పై చాలానే కామెంట్లు చేసాడు. ఒకసారి అయితే గీత దాటాడు కూడా.
టీవీ చానెల్స్ వారు ఆ వీడియో పదేపదే వేసి చూపించారు. దాంతో మనోడు మెగాఫ్యామిలీ సినిమాలు అన్నింటికీ దూరం అవుతున్నాడు. ఇటువంటి వాళ్ళు లౌక్యంగా ఎలాంటి నెగెటివ్ కామెంట్లు లేకుండా తమ పార్టీకి ప్రచారం చేసుకుంటే మంచిది. కానీ పృధ్వీ హద్దులు దాటాడు. ఇతన్ని త్రివిక్రమ్ తన సినిమాలో తీసేశాడట. త్రివిక్రమ్ ఎప్పుడు తన సినిమాల్లో పృధ్వీకి మంచి పాత్రలు ఇచ్చేవాడు. కానీ ఈసారి బన్నీ అతను మన సినిమాలో వద్దు అని చెప్పడంతో అతన్ని తీసేశారని టాక్ వస్తుంది. అలానే మిగతా మెగా హీరోల సినిమాలలోను పృధ్వీకి ఛాన్స్‌లు రాకపోవచ్చు. అలా మనోడు రాజకీయం మీద పిచ్చితో ఏది పడితే అది మాట్లాడి సినిమా ఛాన్స్ లు పోగొట్టుకుంటున్నాడు.