ఈమధ్యలో పెద్ద సినిమాలు ఏమి లేకపోవడంతో చిన్న సినిమాల నిర్మాతలు అంతా తమ సినిమాలు రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు. ఈనేపధ్యంలో ఈ శుక్రవారం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అరడజను పైనే తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో మూడు సినిమాల మీద కొంచెం అంచనాలు ఉన్నాయి.
స్ట్రెయిట్ సినిమాలతో పాటు అనువాదం చిత్రాలు కూడా ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్నాయి. అయితే స్ట్రెయిట్ తెలుగు సినిమాల్లో ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, మల్లేశం చిత్రాలు ఇప్పటికే జనం దృష్టిలో పడ్డాయి. ఈ సినిమాల యొక్క ట్రైలర్స్ అందరిని ఆకర్షించాయి. అలానే ఫస్ట్ ర్యాంక్ రాజు అనే చిన్న సినిమా మీద కూడా కొంచెం అంచనాలు ఉన్నాయి. వీటితో పాటు విష్ణు చిత్రం ‘ఓటర్’ తోపాటు ‘స్పెషల్’, ‘స్టువర్ట్‌పురం’ చిత్రాలు కూడా శుక్రవారమే విడుదల చేస్తున్నారు.
మరి మిగిలిన సినిమాలు గురించి ఎవరు పటించుకుంటారో? అయితే గత రెండు, మూడు వారాలుగా అయితే వచ్చిన సినిమాలు వచ్చినట్టే పోతున్నాయి తప్ప నిలబడడం లేదు. మరి ఈ శుక్రవారం పరిస్థితి ఏంటో చూడాలి. ఇందులో ఏదన్నా సినిమా హిట్ టాక్ దక్కించుకుంటే చాలు సేఫ్ జోన్ కి వెళ్ళిపోయినట్టే. చూద్దాం ఏం జరుగుతుందో..