డైరెక్టర్ రాజమౌళికి బ్రాండ్ వ్యాల్యూ ఉంది కాబట్టి అతని మీద నమ్మకంతో సినిమాల బిజినెస్ లు జరుగుతాయి. అలానే RRR ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరుగుతుందనే భావిస్తున్నారు ట్రేడ్ వర్గాలు. పైగా ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో మూవీ కాబట్టి ప్రీ రిలీజ్ బిజినెస్ లో ఎటువంటి డోకా లేదు. రిలీజ్ కి ఇంకా ఏడాది పైన ఉన్న ఇప్పటి నుండే ఏరియా వైజ్ హక్కులు కోసం ఖర్చీఫ్ లు వేస్తున్నారట. ఈనేపధ్యంలో హిందీతో పాటు నైజాం రైట్స్ కూడా త్వరలోనే అమ్ముడయ్యే అవకాశముందని తెలుస్తుంది.
అయితే మరి నైజాం రైట్స్ ఎవరు చేజిక్కించుకునేది అంటూ ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇంకెవరు దిల్ రాజు. అవును నైజాం రైట్స్ కోసం ఇప్పటికే టాప్ డిస్ట్రిబ్యూటర్ కమ్ నిర్మాత దిల్ రాజు రెడీగా ఉన్నారని తెలుస్తోంది. ఏషియన్ సునీల్ నారంగ్ తో కలిసి దిల్ రాజు నైజాం రైట్స్ దక్కించుకుంద్దాం అని చూస్తున్నారు. ఈమేరకు RRR ప్రొడ్యూసర్ డివివి దానయ్యతో మంతనాలు సాగిస్తున్నారని తెలుస్తోంది. అయితే దానయ్య మాత్రం నైజాంకి రూ.80 కోట్లు వరకు చెబుతున్నాడట. రీసెంట్ గా ఓవర్సీస్ రైట్స్ కే 70 కోట్లు పలికింది. చైనా తప్ప. అందుకే నైజాంకి ఇంత రేట్ చెబుతున్నారట. అయితే 80 కోట్ల మొత్తం అంటే చాలా పెద్దదే.
కాకపోతే పెద్ద సినిమాలకి టికెట్స్ రేట్స్ పెంచుకుంటున్నారు కాబట్టి ఈసినిమాకి కూడా పెంచితే కచ్చితంగా అంత వసూళ్లు వచ్చే అవకాశముంది. పైపెచ్చు ఇటీవల జీఎస్టీ రేటును కూడా తగ్గించేయడంతో ఆ మేరకు రిలీజ్ చేసే సినిమాలకు కలిసొస్తోంది. రిలీజ్ అయిన వారం రోజుల్లోనే దాదాపు పెట్టుబడి లాగేయవచ్చు. మరి ఇంత రేట్ కి దిల్ రాజు ఓకే చెబుతున్నారో లేదో చూడాలి. ఇక ఈచిత్రం 2020 జూలై 30 న రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు.