నాగ చైతన్య గత ఏడాది ఫుల్ ప్లాప్స్ లో ఉన్నప్పటికీ ఈ ఏడాది మాత్రం భార్య సమంతతో కలిసి మజిలీ సినిమాతో అద్భుతమైన హిట్ కొట్టాడు. మజిలీ సినిమాతో చైతు మళ్ళీ ట్రాక్లోకి వచ్చాడు. ఇక మామ వెంకటేష్ తో కలిసి వెంకీమామ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం వెంకీమామ షూటింగ్ కంప్లీట్ చేసుకుని.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వుంది. ఇక చైతు తరువాత దిల్ రాజు బ్యానర్ లో ఒక సినిమా చెయ్యబోతున్నాడు. అలాగే నాగార్జున డ్రీం ప్రాజెక్ట్ బంగార్రాజులోను చైతు గెస్ట్ రోల్ లో కనిపిస్తాడని అంటున్నారు.
తాజాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీలో కనిపించబోతున్నట్లుగా ఓ న్యూస్ ఫిలింసర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం కొత్త హీరో హీరోయిన్ తో ఓ సినిమా చేస్తున్న శేఖర్ కమ్ములకు... ఆ సినిమా షూటింగ్ దాదాపుగా మూడు నెలలు వాయిదా పడడంతో ఈ లోపు చైతుతో, శేఖర్ కమ్ముల ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడనే టాక్ వినబడుతుంది. కొత్త హీరో హీరోయిన్ డాన్స్ ప్రాక్టీస్ కోసం టైం తీసుకోగా.. తన సినిమా షూటింగ్ కి కమ్ముల బ్రేకిచ్చాడట. అయితే చైతుతో ప్లాన్ చేస్తున్న సినిమాలో సాయి పల్లవిని హీరోయిన్ గా శేఖర్ ఖమ్ముల అనుకుంటున్నాడట. ఫిదా సినిమాతో సాయి పల్లవిని తెలుగుకి పరిచయం చేసిన శేఖర్ కమ్ముల ఆ సినిమాలో భానుమతిగా సాయి పల్లవి నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మరోసారి శేఖర్ కమ్ముల సినిమాలో సాయి పల్లవి అంటే ఆ సినిమాపై బీభత్సమైన అంచనాలు ఉంటాయి. ఇక చైతు కూడా ప్రస్తుతం ఫామ్ లో ఉండడం కూడా ఆ సినిమాపై అంచనాలు పెరగడానికి కారణమవుతాయి.