Advertisementt

‘ఆపిల్’ ఫస్ట్‌లుక్ అదిరింది

Tue 18th Jun 2019 01:27 PM
raj kandukuri,released,apple movie,first look  ‘ఆపిల్’ ఫస్ట్‌లుక్ అదిరింది
Apple First Look Released ‘ఆపిల్’ ఫస్ట్‌లుక్ అదిరింది
Advertisement
Ads by CJ

రాజ్ కందుకూరి ఆవిష్కరించిన ‘ఆపిల్’ ఫస్ట్ లుక్ 

పూజాగాంధీ ప్రధాన పాత్రలో బండి వెంకట రెడ్డి సమర్పణలో, శంకర్ దర్శకత్వంలో బాసర రవిచిన్న నిర్మించిన చిత్రం ‘‘ఆపిల్’’. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి ఇటీవలే హైద్రాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు సాగర్ కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రవిచిన్న మాట్లాడుతూ.. ‘‘ఇదొక వెరైటీ చిత్రం. పూజాగాంధీ నటన ఈ చిత్రానికి హైలెట్. జేమ్స్ అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. మా పోస్టర్ ను విడుదల చేసిన రాజ్ కందుకూరి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జులైలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం’’ అని అన్నారు.

పూజాగాంధీ, యశస్, నాగేంద్ర, విజయచందర్, శోభరాజ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఏం ఆర్  శీను, సంగీతం: జేమ్స్, కో ప్రొడ్యూసర్స్: శంకరబాబు, కంద్యనం శ్రీకాంత్, సమర్పణ: బండి వెంకట రెడ్డి, నిర్మాత: బాసర రవిచిన్న, దర్శకత్వం: శంకర్

Apple First Look Released:

Raj Kandukuri Released Apple Movie First Look

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ