సాయి పల్లవి - రానా జంటగా దర్శకుడు వేణు ఊడుగుల దర్శకత్వంలో విరాటపర్వం అనే సినిమా పూజ కార్యక్రమాలతో మొదలవడమే కాదు... అప్పుడే రెగ్యులర్ షూటింగ్ తో చిత్ర బృందం క్షణం తీరిక లేకుండా గడుపుతుంది. నీది నాది ఒకటే కథ అనే సినిమాతో దర్శకుడిగా మెప్పించిన వేణు.. ఇప్పుడు మళ్ళీ సాయి పల్లవి ప్రధాన పాత్రలో, రానా కీలక పాత్రలో విరాటపర్వం అనే వెరైటీ టైటిల్ తో సినిమాని తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో సాయి పల్లవి నక్సలైట్ పాత్రలోనూ రానా వార్డ్ మెంబెర్ గాను కనిపిస్తాడని ప్రచారం ఎప్పటినుండో సోషల్ మీడియాలో వినబడుతుంది.
అయితే తాజాగా విరాటపర్వం కథ ఇదేనంటూ సోషల్ అండ్ వెబ్ మీడియాలో మరో కథ ప్రచారంలోకొచ్చింది. ఈ సినిమాలో సాయి పల్లవి ఓ జర్నలిస్ట్ అంటే రిపోర్టర్ పాత్రలో కనిపిస్తుందని... అది కూడా ఎటువంటి వంక లేకుండా నటిస్తుందట. ఇక రానా నక్సలైట్ గా కనిపిస్తాడని... రానా ని ఇంటర్వ్యూ చెయ్యడానికి వెళ్లిన సాయి పల్లవి రానా తో ప్రేమలో పడుతుందని.. తర్వాత సాయి పల్లవి ప్రేమతో రానా నక్సలిజాన్ని వదిలేసి... ఎలక్షన్స్ లో పోటీ చేసి వార్డ్ మెంబెర్ గా గెలుస్తాడని.. ఇక సాయి పల్లవి - రానా ల మధ్య ప్రేమను దర్శకుడు చాలా సహజ సిద్ధంగా చూపించబోతున్నాడని ఫిలింనగర్ టాక్. మరి విరాటపర్వం సినిమాతో ప్రస్తుతం ప్లాప్స్ లో ఉన్న సాయి పల్లవి మళ్ళీ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు.