Advertisementt

ఈ సినిమా చూడకపోతే.. ఆ అర్హత లేనట్లే!

Mon 17th Jun 2019 08:09 PM
first rank raju,chethan,first rank raju movie,pre release event,maruthi,anil ravipudi  ఈ సినిమా చూడకపోతే.. ఆ అర్హత లేనట్లే!
First Rank Raju Movie Pre Release Event Highlights ఈ సినిమా చూడకపోతే.. ఆ అర్హత లేనట్లే!
Advertisement
Ads by CJ

చేత‌న్ మ‌ద్దినేని, కశీష్ వోహ్రా జంట‌గా న‌రేష్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో డాల్ఫిన్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ప‌తాకంపై మంజునాధ్ వి.కందుకూర్ నిర్మిస్తున్న చిత్రం ‘ఫ‌స్ట్ ర్యాంక్ రాజు’. విద్య 100% బుద్ధి 0% అనేది ఉపశీర్షిక.. ఇటీవ‌లే విడుద‌లైన టీజ‌ర్ మ‌రియు పాట‌లు చాలా పెద్ద హిట్ అయి అద్భుత‌మైన స్పంద‌న ద‌క్కించుకోగా జూన్ 21న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ చిత్రం విడుద‌ల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించింది.

ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ఈ సినిమా టీం అందరికి నా బెస్ట్ విషెష్. కన్నడలో మంచి విజయం సాధించిన ఈ సినిమాలో తెలుగులో కూడా అలాగే హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. చేతన్ సినిమా సినిమాకి మంచి ఇంప్రూవ్ అవుతున్నాడు. టైటిల్ లాగే సినిమా కూడా మంచి మార్కులు పొందాలని కోరుకుంటున్నాను.. అన్నారు. 

డైరెక్టర్ మారుతీ మాట్లాడుతూ.. ఈ సినిమాకి చాలా మంది హీరోలు అనుకున్నా ప్రొడ్యూసర్ గారు చేతన్ కి సెలెక్ట్ చేసి అక్కడే ఫస్ట్ సక్సెస్ అయ్యారు. ఈ పాత్రకి చేతన్ తప్ప వేరెవరు న్యాయం చేసేవారు కారు, చాలా పర్ఫెక్ట్ గా ఫిట్ అయిపోయాడు. మిగిలిన అందరు చాలా బాగా నటించారు. అందరు ఎంతో కష్టపడి ఈ సినిమాని మంచి క్వాలిటీగా తీశారు. ఈ సినిమా ద్వారా నిర్మాత మంజునాథ్ గారు, డైరెక్టర్ నరేష్ గారు తెలుగులో కూడా మంచి మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను.. అన్నారు.  

చిత్ర నిర్మాత మంజునాథ్ వి కందుకూర్ మాట్లాడుతూ.. సినిమా పట్ల ఉన్న ఫ్యాషనేట్ తోనే ఫస్ట్ ర్యాంక్ రాజు సినిమా చేశాను. తప్పకుండా ఒక మంచి సినిమా తీస్తే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే ఉద్దేశ్యంతోనే ఈ సినిమా చేశాను. అందరూ చాలా మంచిగా ఆదరించారు. ఇక్కడ చాలా నేర్చుకున్నాను. సినిమా గురించి మంచి ప్రమోషన్ ఇచ్చారు. ఈ సినిమాని అందరికి నచ్చేలా తీశాం. అందరు తప్పకుండా చూడండి.. అన్నారు. 

దర్శకుడు నరేష్ మాట్లాడుతూ.. ఈ సినిమా అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, మారుతీ గారికి చాలా థాంక్స్. ఈ సినిమా కోసం కష్టపడిన అందరికి కృతజ్ఞతలు. ఒక చిన్న ఐడియాతో మొదలైన ఈ సినిమా ఇంతవరకు వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. లైఫ్ లో ఒక్క విద్యనే కాదు బుద్ధి కూడా ఉండాలి అనే మెసేజ్ తో ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా ఎక్కడా ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ ని కించపరిచేలా ఉండదు. ఈ సినిమా అందరూ స్టూడెంట్స్ చూడాల్సిన సినిమా. తప్పకుండా ఈ సినిమా అందరికి నచ్చుతుంది అన్నారు. 

హీరోయిన్ కశీష్ వోహ్రా మాట్లాడుతూ.. నా కెరీర్ లో నేను చూసిన బెస్ట్ స్క్రిప్ట్ ఇది.. చాలా మంచి రోల్ చేశాను. ఈ పాత్రకు నన్ను ఎంపిక చేసిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. ఈ సినిమా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. సినిమాని అందరు చూసి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను అన్నారు. 

హీరో చేతన్ మాట్లాడుతూ.. నాకీ అవకాశం ఇచ్చిన మంజునాథ్ గారికి చాలా థాంక్స్. సొంత కొడుకులా చూసుకున్నారు. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది. ఆయనతో మళ్ళీ మళ్ళీ సినిమా చేయడానికి రెడీ. ఈ సినిమాకి సపోర్ట్ చేసిన అందరికి చాలా చాలా థాంక్స్. పెద్ద పెద్ద ఆర్టిస్ట్స్ ఈ సినిమాకి డేట్స్ ఇచ్చి సినిమాకి సపోర్ట్ చేశారు. స్క్రిప్ట్ ని నమ్మి చేసిన సినిమా ఇది.. మళ్ళీ అందరిని సక్సెస్ మీట్ లో కలుద్దాం. మంచి కంటెంట్ ఉన్న సినిమా చూడనప్పుడు రొటీన్ సినిమాలు ఎందుకు వస్తున్నాయని అడిగే అర్హత లేదని నా అభిప్రాయం.. అన్నారు. 

First Rank Raju Movie Pre Release Event Highlights:

First Rank Raju Movie Pre Release Event details