Advertisementt

ఈ హీరోయిన్ నిశ్చితార్థం అయిపోయిందా?

Sun 16th Jun 2019 12:34 AM
regina,engagement,heroine  ఈ హీరోయిన్ నిశ్చితార్థం అయిపోయిందా?
Rumours on Young Heroine Engagement ఈ హీరోయిన్ నిశ్చితార్థం అయిపోయిందా?
Advertisement
Ads by CJ

కెరీర్ పరంగా పర్లేదు అనిపించుకున్న రెజినాకు ఈ మధ్య అసలు అంటే అసలు కలిసి రావడంలేదు. ఆమె నుండి ఒక్క సినిమా కూడా హిట్ అవ్వడం లేదు. వరసగా ఫ్లాపుల‌తో రెజీనా కెరీర్ దారుణ‌మైన ప‌రిస్థితుల్లో ప‌డిపోయింది. డైరెక్టర్స్ కూడా ఈమె వైపు చూడట్లేదు. ప్రస్తుతం హిట్ కోసం చాలా ట్రై చేస్తున్న రెజినా ఎవరికి చెప్పకుండా నిశ్చితార్థం చేసుకుందని ప్ర‌చారం జ‌రుగుతుంది. అలానే త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతుందని వార్తలు వస్తున్నాయి.

రీసెంట్ గా ఈమె చేసిన సెవెన్ సినిమా కూడా డిజాస్ట‌ర్ అయిపోయింది. ఇందులో పూర్తిగా నెగిటివ్ రోల్ చేసింది రెజీనా. తనకు అసలు సినిమాలు కలిసిరావడం లేదని ఇలాంటి ప‌రిస్థితుల్లో ఇక పెళ్లొక్క‌టే శ‌ర‌ణ్య‌మ‌ని.. ఆ వైపుగానే రెజీనా అడుగేస్తుంద‌ని తెలుస్తుంది. ఈనెల జూన్ 13న రెజినా చాలా తక్కువ మంది సమక్షంలో నిశ్చితార్థం చేసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. 

అయితే దీనిపై ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు. ఆ మధ్య సందీప్ కిషన్‌ని లవ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడేమో ఏకంగా నిశ్చితార్థం అయిపోయిందని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంతనుందో తెలియాలంటే రెజినా నోరు విప్పాల్సిందే.

Rumours on Young Heroine Engagement :

Regina Engagement Finished

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ