Advertisementt

అర్రె.. నయన్ భలే మూవీ మిస్సయిందే?

Sun 16th Jun 2019 12:23 AM
taapsee,game over,nayanthara,missed,heroine  అర్రె.. నయన్ భలే మూవీ మిస్సయిందే?
Nayanthara Missed.. Taapsee Catched అర్రె.. నయన్ భలే మూవీ మిస్సయిందే?
Advertisement
Ads by CJ

సౌత్ లో నయనతార కి ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు ఆమె కోసమే సినిమాలకు వెళ్లే జనాలు ఉన్నారు. ఆమె నుండి ఎటువంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు వచ్చినా అవి కచ్చితంగా సక్సెస్ అవుతాయి. ఆమె స్టోరీ సెలెక్షన్స్ కూడా చాలా బాగుంటాయి. ఆమె సినిమాలంటే టికెట్ కౌంట‌ర్ల ద‌గ్గ‌ర క్యూ క‌ట్టేవాళ్లున్నారు. ప్రొడ్యూసర్స్ కి కూడా ఇదే కావాలి అందుకే ఆమెతో ఎక్కువమంది లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికే ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె నుండి ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేయి జారింది.

నిన్న విడుదలై మంచి సక్సెస్ అందుకున్న ‘గేమ్ ఓవ‌ర్‌’ క‌థ కూడా న‌య‌న‌దే. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించాలనుకున్నారు మేకర్స్. నయన్ కు పారితోషికం మిన‌హాయించి 7 కోట్ల‌లో ఈ సినిమా పూర్తి చేయాల‌ని అనుకున్నారు. రెండు మూడు రోజులు షూటింగ్ కూడా చేసారు. అయితే ఈ మూవీ లైన్ హాలీవుడ్ సినిమా నుండి తీసుకుంది. కథ విషయంలో రైటర్ కి చిత్రం బృదం కి తేడా రావడంతో ఆ సినిమా ఆగిపోయింది. దాంతో ఆ సినిమా తాప్సి ద‌గ్గ‌ర‌కు వెళ్లింది. 

అయితే.. క‌థ‌లో కొన్ని కీల‌క మార్పులు (టాటూ ఎపిసోడ్‌)లాంటివి వ‌చ్చి చేరాయి. తాప్సి పెర్ఫార్మన్స్ కూడా చాలా బాగుందని చెబుతున్నారు. రిలీజ్ అయినా అన్ని చోట్ల ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతుంది.

Nayanthara Missed.. Taapsee Catched :

Taapsee Game over gets hit talk at box Office

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ