విజయం కోసం చకోరపక్షుల్లా ఎదురుచూస్తున్న హీరో రామ్, దర్శకుడు పూరీజగన్నాథ్, ఐరన్‌లెగ్ చార్మీలు ప్రస్తుతం ఇస్మార్ట్ శంకర్ సినిమాలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం వచ్చే నెల విడుదల కానుంది. ఇటీవలే విడుదలైన ఫస్ట్ ఆడియో సింగిల్ ధిమాక్ ఖరాబ్ ఇప్పటికే ఆన్‌లైన్‌లో రచ్చ చేస్తోంది. హాఫ్ మిలియన్ వ్యూస్‌ను దక్కించుకుని ముందుకు సాగుతోంది. ఈ స్పెషల్‌సాంగ్‌లో నిధి అగర్వాల్, నభా నటేష్‌లు రామ్‌తో కలిసి నర్తించారు. సాధారణంగా ఐటం సాంగ్‌కి ఇతర హీరోయిన్లను ఎంపిక చేసుకుంటారు. కానీ ఈ విషయంలో కూడా ఇస్మార్ట్ శంకర్ రూటే సపరేట్.
దాంతో ఆయన తన తోటి హీరోయిన్లతోనే ఐటమ్‌సాంగ్‌లో నటించాడు. డిల్లీ ఢాబా తరహాలో వేసిన సెట్‌లో జానీ మాస్టర్ ఊరమాస్ స్టెప్పులతో ఈ పాట చిత్రీకరణ జరిగింది. ఈ పాట తీస్తున్నంత సేపు తాము ఎంతో ఎంజాయ్ చేశామని, కాసర్లశ్యామ్ లిరిక్స్ అర్ధం కాకపోయినా వాటిలో రైమింగ్ భలేగా ఉందని నిధి అగర్వాల్ చెప్పగా, నభా నటేష్ అయితే ఏకంగా పాటను పాడి వినిపించింది. నిర్మాతల్లో ఒకరైన చార్మి తమతో చాలా బాగా కలిసి పోయిందని నిర్మాతననే దర్పం లేకుండా ఆమె హుందాగా ప్రవర్తించిన తీరు తమని ఎంతో ఆశ్చర్యానికి గురి చేసిందని వీరు చెప్పుకొచ్చారు.
జానీ మాస్టర్ మాకు తగ్గట్లు మూమెంట్స్ చేయించడం ఒక ఎత్తైతే ఎనర్జిక్ స్టార్ రామ్‌తో కలిసి డ్యాన్స్ చేయడం మరో మరిచిపోలేని అనుభవమని వారు తెలిపారు. మొత్తానికి ఇస్మార్ట్ శంకర్‌లో దిమాక్ ఖరాబ్ పాట ఏ రేంజ్‌లో అదరగొట్ట బోతోందో వీరి మాటలను బట్టి వింటే అర్ధమైపోతుంది. ఇస్మార్ట్ శంకర్ తమకి తెలుగులో పెద్ద బ్రేక్‌నిస్తుందనే నమ్మకంతో ఈ ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు.