Advertisementt

‘సై..రా’ ఎక్కడున్నాడంటే..!

Sat 15th Jun 2019 02:20 PM
chiranjeevi,sye raa,shooting,pondicherry,latest,update  ‘సై..రా’ ఎక్కడున్నాడంటే..!
Sye Raa Movie Latest Update ‘సై..రా’ ఎక్కడున్నాడంటే..!
Advertisement
Ads by CJ

మెగాస్టార్‌ చిరంజీవి తన ప్రతిష్టాత్మకమైన 151వ చిత్రంగా తొలి స్వాతంత్య్ర సమరయోధుడు, రాయలసీమ ముద్దుబిడ్డ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్‌ని ‘సై..రా..నరసింహారెడ్డి’ పేరుతో సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తన తనయుడు రామ్‌చరణ్‌ నిర్మాతగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్‌ దాదాపు పూర్తయింది. అయితే కొద్దిపాటి బ్యాలెన్స్‌ వర్క్‌ ఉంది. ఉయ్యాలవాడ బృందానికి, బ్రిటిషర్లకు మధ్య జరిగే కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి సెట్స్‌ వేయలేని పరిస్థితి. దాంతో బ్రిటిషర్ల భవంతులు ఎక్కువగా ఉన్న పాండిచ్చేరిలో నిజమైన బ్రిటిష్‌ భవనాల ప్రాంగణంలో వీటిని చిత్రీకరిస్తున్నారు. 

దీంతో బ్యాలెన్స్‌ వర్క్‌ కూడా పూర్తవుతుంది. ఇకపై పూర్తిగా సురేందర్‌రెడ్డి పోస్ట్‌ప్రొడక్షన్స్‌పై దృష్టి పెట్టనున్నాడు. రెండేళ్లకుపైగా షూటింగ్‌ జరుపుకున్న సై..రా ఎట్టకేలకు ఈ ఏడాది అక్టోబర్‌2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా విడుదల కానున్నట్లు పక్కా సమాచారం. అన్‌లిమిటెడ్‌ బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీకి 200కోట్లకు పైగా బడ్జెట్‌ ఖర్చు అయిందని తెలుస్తోంది. దాంతో ఈ మూవీని తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా భారీగా విడుదల చేయనున్నారు. 

తెలుగులో బాహుబలి రికార్డులను కొల్లగొట్టే సత్తా కేవలం తమ మెగాస్టార్‌ నటిస్తున్న సై..రా చిత్రానికే ఉందని మెగాభిమానులతో పాటు ట్రేడ్‌ వర్గాలు కూడా భావిస్తున్నాయి. మరి అక్టోబర్‌ 2న ఈ చిత్రం విడుదల తర్వాత దీనిసత్తా ఏమిటి? యంగ్‌ ప్రభాస్‌, రాజమౌళిలను తన సై..రా ద్వారా చిరు దాటగలడా? లేదా? అనేది వేచిచూడాల్సివుంది.....! 

Sye Raa Movie Latest Update:

Sye Raa Shooting In Pondicherry

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ