Advertisementt

'సాహో' టీజర్ కు మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్!

Sat 15th Jun 2019 01:38 PM
saaho,teaser trending,number one,internet  'సాహో' టీజర్ కు మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్!
Saaho trending Number one on the Internet! 'సాహో' టీజర్ కు మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్!
Advertisement
Ads by CJ

'బాహుబలి' 1, 2 తరువాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానుల ఉత్కంఠని మరింత పెంచుతూ మూడు భాషల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం సాహో. ఇండియన్ బాహుబలి ప్రభాస్ కి ఎంతటి డై హార్డ్ ఫాన్స్ వుంటారో తెలిసిందే. వాళ్ళు చూపించే అభిమానాన్ని మాటల్లో చెప్పలేం. ఇప్పుడు రెబెల్ స్టార్ ప్రభాస్ తన డై హార్డ్ ఫాన్స్ గర్వపడే సాహో టీజర్ ను కానుకగా అందించాడు. ఈరోజు విడుదలైన సాహో టీజర్ సంచలనాలు సృష్టిస్తోంది. రిలీజ్ అయిన క్షణం నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకొని దుమ్ము దులిలేస్తోంది సాహో టీజర్. మరీ ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. మేకింగ్ వీడియోలలోనే వీటి గురించి ప్రత్యేకంగా చెప్పిన దర్శకుడు ఇప్పుడు టీజర్ లో మరింత అద్భుతమైన అవుట్ పుట్ ఇచ్చాడు.  అంతగా యాక్షన్ సీన్స్ తో వరల్డ్ క్లాస్ మేకింగ్ చూపించాడు డైరెక్టర్ సుజీత్. బాహుబలి తర్వాత ప్రభాస్ ఎలాంటి సినిమా అయితే చేయాలని అభిమానులు కోరుకున్నారో సాహో అచ్చం అలాగే ఉంది. ఇప్పుడు టీజర్ చూసిన తర్వాత కచ్చితంగా సినిమా కూడా సంచలనం సృష్టిస్తుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టీజర్ లో కనిపించిన సీన్స్ హాలీవుడ్ సినిమాలను గుర్తుకు తెచ్చింది. తెలుగు సినిమా స్థాయి పెరిగిందంటూ... ప్రభాస్ ఫాన్స్ కాలర్ ఎగరేసుకుంటున్నారు. ప్రేక్షకుల, అభిమానుల అంచనాలను అందుకునేలా ప్రభాస్ స్టైలిష్ గా, కొత్త ఎనర్జీ తో కనిపించారు. ఇండిపెండెన్స్ డే కానుకగా అగ‌స్ట్ 15 న ప్ర‌పంచ‌వ్యాప్తంగా బిగ్గెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ద ఇయ‌ర్ గా విడుద‌ల కి సిద్ధ‌మౌతోంది. 

యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మూడు భాషల్లో ఒకేసారి షూట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ఒకే రోజున విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా విడుద‌ల చేసిన షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 1 కి ఇప్ప‌టికే ఇండియా మెత్తం క్రేజ్ వ‌చ్చింది. ప్ర‌పంచంలో వున్న రెబెల్‌స్టార్ ఫ్యాన్స్ పండ‌గ చేసుకున్నారు. 

షేడ్స్ ఆఫ్ సాహో 2 తో ఈ చిత్రం హీరోయిన్ బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ బర్త్ డే కానుకగా విడుదల చేసిన వీడియో కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ స్పెషల్ వీడియో లో  శ్రద్దా కపూర్ క్యారెక్టర్ లుక్ ని రివీల్ చేశారు. ఈ వీడియో లో ప్రభాస్, శ్రద్దా కపూర్ స్టైలిష్ లుక్స్... ఇంటర్నేషనల్ స్టాండర్ఫ్స్ మేకింగ్ హైలైట్ గా నిలుస్తున్నాయి. ఈ మేకింగ్ వీడియోతో ఈ సినిమా ఏ రేంజ్ లో తీస్తున్నారు అనేది మరింత స్పష్టమైంది. డినో యురి 18 కెడబ్ల్యూ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సినిమా విజువల్స్ ని క్యాప్చర్ చేయడం మరో విశేషం. ఇంత‌టి భారీ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రానికి ర‌న్‌ రాజా రన్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న సుజీత్  దర్శకత్వం వహిస్తున్నాడు. సాహోని ఓ విజువల్ వండర్ గా తీర్చిదిద్దేందుకు దర్శకుడు సుజిత్ తో పాటు హాలీవుడ్, బాలీవుడ్ కి చెందిన ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. హైటెక్ యాక్ష‌న్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో మైమరపించే యాక్షన్ సన్నివేశాలను అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చిత్రీక‌రించారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మధి, ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరీల్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ వంటి టాప్ టెక్నీషియన్స్ సాహో చిత్రానికి వర్క్ చేస్తుండడం విశేషం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. 

Saaho trending Number one on the Internet!:

Saaho teaser finally got unveiled today. Darling fans all over the world are celebrating like a long-awaited festival. The teaser is simply beyond our imagination and it is way beyond our Indian film making standards. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ