ఈ ఏడాది ఎఫ్ 2 తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం హారిష్ శంకర్ దర్శకత్వంలో వాల్మీకి సినిమా షూటింగ్ లో బాగా బిజీగా ఉన్నాడు. వాల్మీకి షూటింగ్ కోసం రాత్రియంబవళ్ళు కష్టపడుతున్న హీరో వరుణ్ తేజ్ కారుకు ఈ రోజు సాయంత్రం యాక్సిడెంట్ అయ్యింది. కొత్తకోట (మం) రాయిని పెట్ స్టేజి దగ్గర NH44 జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు వెతుండగా ఈ కారు యాక్సిడెంట్ అయినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ యాక్సిడెంట్ లో వరుణ్ తేజ్ కి గాయాలేమైనా అయ్యాయేమో అని మెగా అభిమానులు కంగారు పడుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో వరుణ్ తేజ్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. అయితే ఈ యాక్సిడెంట్‌లో ఇద్దరు మాత్రం గాయపడ్డారు. వారిని దగ్గరలోనే ఉన్న హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు.