నిర్మాతగా దిల్‌రాజుకి ‘శ్రీనివాసకళ్యాణం, లవర్’ వంటి ఫ్లాప్స్ వస్తున్నా ఇవ్వన్నీ లిమిటెడ్ బడ్జెట్‌తో తీసిన చిత్రాలు కావడంతో తదుపరి చేసే పెద్ద చిత్రాలను చూసి బయ్యర్లు కూడా మౌనంగా ఉంటున్నారు. కానీ ఇటీవల దిల్‌రాజుకి పంపిణీదారునిగా పెద్దగా కలిసి రావడం లేదు. ‘నమో వేంకటేశాయ’కి ముందు తర్వాత కూడా ఆయనకు పలు చిత్రాలు భారీ నష్టాలనే మిగిల్చాయి. అయినా కూడా దిల్‌రాజు ఓ చిత్రం పంపిణీహక్కులు తీసుకున్నాడంటే ఇక దానికి మిగతా రెండు తెలుగు రాష్ట్రాలలో వచ్చే హైప్ మామూలుగా ఉండదు.
ఇక ‘బాహుబలి’ విషయంలో తర్జనభర్జన పడిన దిల్‌రాజు.. ప్రభాస్ తదుపరి చిత్రంగా రూపొందుతున్న ‘సాహో’ మీద మాత్రం బాగా గురిగా ఉన్నాడని అంటున్నారు. ఇక దిల్‌రాజులో ఉన్న మరో టెక్నిక్ ఏమిటంటే.. తాను ఏదైనా స్టార్ హీరో డేట్స్ సంపాదించాలని అనుకుంటే ముందుగా వారిని ప్రసన్నం చేసుకునేందుకు నైజాంలోనో లేక ఉత్తరాంధ్రలోనో పంపిణీహక్కులు దక్కించుకుంటాడు. ఇక విషయానికి వస్తే ప్రభాస్ ‘సాహో’ చిత్రం పూర్తయిందని, ఇక ఒక పాట షూటింగ్ తప్ప బ్యాలెన్స్ ఏమీ లేదని వార్తలు వస్తున్నాయి. దీంతో దిల్‌రాజు అలర్ట్ అయిపోయాడు. తనకు బాగా పట్టున్న నైజం, ఉత్తరాంధ్ర ఏరియాలకు గాను ఈయన ‘సాహో’ కోసం ఏకంగా 45 కోట్లను యువి క్రియేషన్స్ వారికి ఆఫర్ చేశాడట.
ఈ విషయంలో ఇంత ప్రాధాన్యం ఏమిటంటే... ఇది చాలా పెద్ద డీల్ కింద లెక్క, రాజు గారు మనసు పెడితే ఇదే బడ్జెట్‌తో రెండు మూడు ‘ఎఫ్2’లు బయటకు వస్తాయి. పోనీ ఈయనకంటే ఎక్కువ ఆఫర్ చేసే వారు లేరా? అంటే ఉండి ఉండవచ్చు. కానీ నైజాం, ఉత్తరాంధ్రలో డిస్ట్రిబ్యూటర్‌గా మంచి పట్టు ఉన్న దిల్‌రాజుని యువి క్రియేషన్స్ సంస్థ వదులుకునేందుకు సిద్దంగా లేదు. అసలు దిల్‌రాజు ప్రభాస్‌తో ‘బాహుబలి’ తర్వాత ఓ చిత్రం చేయాలనుకుంటున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ప్రభాస్‌తో ఆయన ఇంత పెద్దస్టార్ కాకముందు దిల్‌రాజు రెండు చిత్రాలు తీశాడు. వంశీపైడిపల్లిని దర్శకునిగా పరిచయం చేస్తూ తీసిన ‘మున్నా’ చిత్రం ఫ్లాప్ అయింది. ఆ తర్వాత ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ అనేహిట్ చిత్రం తీశాడు. మొత్తానికి ఏది ఏమైనా దిల్‌రాజు కోట్ చేసిన రేటు చూసి మిగిలిన రెండు రాష్ట్రాలలో కూడా ‘సాహో’ బిజినెస్ అదిరిపోయే లెవల్‌లో జరగడం గ్యారంటీ అనే చెప్పాలి.