జబర్దస్త్...ఈ షోకి తెలుగు స్టేట్స్ లో ఎంత పాపులారిటీ వచ్చిందో మనం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వారానికి రెండు రోజులు వచ్చే ఈ షోకి టిఆర్పి రేటింగ్స్ ఒక రేంజ్ లో ఉంటాయి. ఇందులో యాక్ట్ చేసేవాళ్లు ఎంత ఫేమసో జడ్జిలు కూడా అంతే ఫేమస్. ఈ షో స్టార్ట్ అయిన దగ్గర నుండి జడ్జిలుగా నాగబాబు అండ్ రోజానే ఉన్నారు.
ఈమధ్య ఆంధ్రాలో ఎన్నికలు జరిగిన కారణంగా ఇద్దరు తమ తమ పార్టీస్ తో బిజీ అయిపోయారు. రాజకీయ వేడిలో ఇద్దరు రెండు నెలలు పాటు ఈ షోకి దూరంగా ఉన్నారు. అయితే ఎలక్షన్స్ అయిపోయిన తరువాత వెంటనే రోజా వచ్చేసారు కానీ నాగబాబు చాలా టైం తీసుకున్నారు. ఏదైతేనేం నాగబాబు మళ్లీ తన సొంత గూటికి వచ్చేసాడు. ఈసారి మరింత రీ ఫ్రెషింగ్‌గా కనిపించాడు మెగా బ్రదర్.
అంతకుముందు నాగబాబు ప్లేస్ లో ఆలీ వస్తుండటంతో నాగబాబుకు పూర్తిగా చెక్ పడిపోయినట్లే అని అనుకుంటున్న అభిమానులకు ఇప్పుడు మళ్లీ కళ వచ్చింది. పాత జడ్జిలను చూడటంతో షో రేటింగ్ మళ్లీ పెరగడం ఖాయంగా కనిపిస్తుంది. ఈవారం రిలీజ్ అయిన ప్రోమోలో నాగబాబు కనిపించరు. అంటే నెక్స్ట్ వీక్ లో నాగబాబు ఎంట్రీ ఉండనుంది.