ఈమధ్య మన టాలీవుడ్ వాళ్ళకి కాపీ కొట్టడం ఓ హాబీగా తయారైంది. అలానే రీమేక్స్ కూడా చేస్తున్నారు. రీమేక్ అంటే కచ్చితంగా ఒరిజినల్ రైట్స్ దక్కించుకున్నాకే సినిమా స్టార్ట్ చేయాలి. అలా చేయకపోతే దొంగ చాటుగా సినిమాను తీసి రిలీజ్ చేయాలి. కానీ ఇప్పుడు తెలుగు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఇటువంటివి కష్టమే. ఒకవేళ కాపీ కొట్టాలని చూసినా వెంటనే దొరికిపోతున్నారు.
అందుకే మన మేకర్స్ అఫీషియల్ గా రీమేక్ రైట్స్ కొని రిస్క్ తగ్గించుకుంటున్నారు. ఇప్పుడు అడవి శేషు కూడా తన తాజా చిత్రం ‘ఎవరు’ కోసం అలాంటి ప్రయత్నం ఏమన్నా చేసాడా అనేది హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గా అడివి శేష్ ‘ఎవరు’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో పోస్టర్ ని రిలీజ్ చేసాడు. దీన్ని వెంకట్ రాంజీ దర్శకత్వం చేసాడు. ఇది ఒక సస్పెన్సు థ్రిల్లర్ గా తెరకెక్కింది.
అయితే ఇది స్పానిష్ చిత్రం “The Invisible Guest” ఆధారంగా రూపొందుతోందని సమాచారం. దీని రైట్స్ తీసుకుని కొద్దిగా మార్చి తాప్సీతో బదలా చిత్రం చేసారు. అది అక్కడ హిట్ అయింది. మరి ఇప్పుడు తెలుగులో అడివి శేష్ ఈసినిమా రైట్స్ కొని చేసారా... లేక లేపేసారా అనే విషయం తెలియరాలేదు. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ ఏమిటంటే ఈమూవీ షూటింగ్ ఎవరికి తెలియకుండా కంప్లీట్ అయిపోవడం. ఇందులో అడవి శేషుకి సరసన హీరోయిన్ గా రెజీనా కాసాండ్రా నటించింది. ఆగస్టు 23న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్.