అర్జునుడి విల్లులా తన శరీరాన్ని సిద్దంచేస్తున్న సుధీర్‌బాబు
ఘట్టమనేని నట వంశం నుండి తెలుగు తెరకు పరచయమైన సుధీర్ బాబు తనని తాను నటుడుగా మలుచుకున్నాడు. తనకి తన బాడీ లాంగ్వేజ్ కి సరిపోయో పాత్రల్లో నటించి మెప్పించి తనకంటూ ప్రత్యేఖమైన స్థానం సంపాయించుకున్నాడు. ఎస్.ఎమ్.ఎస్ చిత్రంలో పరిచయం అయినా కమర్షియల్ బ్లాక్‌బస్టర్ గా ప్రేమకథాచిత్రమ్ అందించాడు. ఆ తరువాత తనకంటూ ప్రత్యేకతని చాటుకుంటూ చిత్రాలు చేసుకుంటూ వస్తున్నాడు. సుధీర్‌బాబు అనగానే టాలీవుడ్ లో ముందు గుర్తోచ్చేది మాత్రం అతని ఫిజిక్. జిమ్ లో వర్కవుట్ చేస్తూ ఆయన సోషల్ మీడియాలో చేస్తున్న పోస్ట్ లకి విపరీతంగా క్రేజ్ రావటం విశేషం. బాలీవుడ్ చిత్రం భాగి లాంటి చిత్రంలో టైగర్ ష్రాఫ్ తో కలిసి నటించి యావత్ ఇండియన్ ఆడియన్స్ ని అలరించారు. 2018 లో సమ్మెహనం, నన్నుదోచుకుందువటే చిత్రాలతో టైమ్స్ ఆఫ్ ఇండియా మెస్ట్ డిజరబుల్ మెన్ లో టాప్ 15 లో సుధీర్‌బాబు నిలబడటం విశేషం.
ఇప్పడు సుధీర్ బాబు V అనే చిత్రంలో నటిస్తున్నారు, పుల్లల గోపిచంద్ బయోపిక్ గా వస్తున్న చిత్రంలో కూడా నటించబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ రెండు పాత్రల కోసం తన బాడిని ఇష్టంతో కష్టపెట్టి వర్కవుట్ చేస్తున్నాడు. ఇంద్రధనుస్సులా, అర్జునుడి విల్లులా తన బాడీని తయారు చేస్తున్నాడు. దీనికోసం దాదాపు ఉదయం 4 గంటలు, సాయంత్రం 4 గంటలు రోజుకి 8 గంటలు శ్రమించటం సుధీర్ బాబుకి సినిమా పట్ల వున్న డెడికేషన్ తెలుస్తుంది.