అనిల్ రావిపూడి - మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైపోయింది. ప్రస్తుతం మహర్షి విజయంతో మహేష్ బాబు తన భార్య పిల్లలతో విదేశీ ట్రిప్ లో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. కొడుకు గౌతమ్, కూతురు సితార ల అల్లరితో మహేష్ కూడా జట్టుకట్టేసాడు. ఇక మహేష్ విదేశాలనుండి తిరిగిరాగానే చిన్నపాటి రెస్ట్ తర్వాత అనిల్ రావిపూడి తో సరిలేరు నీకెవ్వరు సెట్స్ మీదకెళ్తాడట. ఇక ఈ సినిమాలో చాలా రోజుల తర్వాత విజయశాంతి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతుంది.
కొన్నాళ్ల క్రితమే రాజకీయాల కోసం సినిమాలు వదిలేసిన విజయశాంతి, మహేష్ సరిలేరు నీకెవ్వరుతో రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. అయితే మొదటినుండి గ్లామర్ పాత్రలకన్నా ఎక్కువగా గడుసు పాత్రలు చెయ్యడం, అలాగే లేడి సూపర్ స్టార్ మాదిరి సోలో గా సినిమాలు చేస్తూ మంచి హిట్స్ కొట్టిన విజయశాంతి.. మహేష్ సినిమాలోనూ ఓ పవర్ ఫుల్ పాత్రే చెయ్యబోతుందట. ఈ సినిమాలో విజయశాంతి ఊరు బాగుకోసం తప్పనిసరి పరిస్థితుల్లో కత్తి పట్టిన పవర్ఫుల్ ఫ్యాక్షన్ లీడర్ గా కనిపించబోతుందనే న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. ఇక ఈ సినిమాలో మరో కీలకమైన పాత్రను చేస్తోన్న జగపతిబాబుతో విజయశాంతి పాత్ర తలపడనుందని అంటున్నారు.
మరి ఒసేయ్ రాములమ్మ లాంటి సినిమాల్లో విజయశాంతి చేసిన పాత్రలు ఎప్పటికి హైలెట్. ఇక సరిలేరు నీకెవ్వరు సినిమాలోనూ విజయశాంతి పాత్ర ఎప్పటికి ప్రేక్షకుల మదిలో నిలిచిపోతుందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు తో లక్కీ హీరోయిన్ రష్మిక మందన్న జోడి కడుతుంది.