Advertisementt

మహేష్ ఇంకా మేజర్ లుక్‌లోకి రాలేదు!

Thu 06th Jun 2019 05:33 PM
mahesh babu,holiday trip,namrata shirodkar,sarileru meekevvaru,super star  మహేష్ ఇంకా మేజర్ లుక్‌లోకి రాలేదు!
Namrata Shirodkar posts Mahesh Babu’s Latest Photos మహేష్ ఇంకా మేజర్ లుక్‌లోకి రాలేదు!
Advertisement
Ads by CJ

మహేష్‌ ‘మహర్షి’ చిత్రంలో రైతుగా, ఎన్నారైగా, విద్యార్ధిగా విభిన్న గెటప్‌లతో కనిపించాడు. చిరు గడ్డం, మీసాలతో దర్శనమిచ్చాడు. ఇక ఆయన తదుపరి చిత్రం అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’గా రూపొందనుంది. ఈ గ్యాప్‌లో మహేష్‌ తన ఫ్యామిలీతో కలిసి యూరప్‌ వెకేషన్స్‌కి వెళ్లాడు. అక్కడ తాము తీయించుకున్న కొన్ని ఫొటోలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నాడు. మహేష్‌ శ్రీమతి నమ్రతా కూడా ఓ ఫొటోని షేర్‌ చేసుకుంది. ఈ ఫొటోలో మహేష్‌, సితార, గౌతమ్‌లున్నారు. 

ఇందులో మరలా మహేష్‌ తన ఓల్డ్‌ స్టైల్‌లోకి వచ్చేశాడు. క్లీన్‌షేవ్‌తో కనిపిస్తూ మరలా తన పూర్వపు స్టైల్‌కి రావడం అభిమానులకు ఆనందంగాఉంది. ‘సరిలేరు నీకెవ్వరు’ ఇటీవల మే31న ప్రారంభం జరుపుకుంది. ఈ నెలాఖరు నుంచి షూటింగ్‌ మొదలవుతుంది. మరి ఈ చిత్రంలో మహేష్‌ ఆర్మీ మేజర్‌ కనుక అనిల్‌రావిపూడి.. మహేష్‌ని ఎలా చూపిస్తాడో అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ ఫొటోలలోని మహేష్‌ని చూస్తే కొత్త చిత్రంలో మహేష్‌ నార్మల్‌గా కనిపించనున్నాడని, ఎలాంటి మేకోవర్స్‌ లేవని అర్ధమవుతోంది.

ఈ ఫొటోలు ఉన్న మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇందులో మహేష్‌ కింద స్టార్‌ డిజైన్‌ ఉంది. నెటిజన్లకు నమ్రతా దీని ద్వారా మహేష్‌ సూపర్‌స్టార్‌ అనే విషయాన్ని మరోసారి గుర్తు చేస్తోందేమో అనిపించకమానదు. ఈ ఫొటోకు ‘నా జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తులు. చాలాకూల్‌. లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సెలబ్రేటింగ్‌ మహర్షి’ అని నమ్రతా క్యాప్షన్‌ ఇచ్చింది. 

Namrata Shirodkar posts Mahesh Babu’s Latest Photos:

Namrata Shirodkar shares a picture of husband Maheshbabu and the kids.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ